Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 02:12 PM

ఇందిరమ్మ ఇళ్లతో పేదల జీవితాల్లో వెలుగులు

19-03-2026 131 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

నల్గొండ జిల్లా చిట్యాల మండలం పెద్దకాపర్తి, గుండ్రాంపల్లి గ్రామాల్లో నిర్మించిన ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమం గురువారం ఘనంగా జరిగింది. జిల్లా కలెక్టర్ బడుగు చంద్రశేఖర్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం ముఖ్య అతిథులుగా హాజరై లబ్ధిదారులతో కలిసి సామూహిక గృహప్రవేశాలు నిర్వహించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ లబ్ధిదారుల ముఖాల్లో కనిపిస్తున్న ఆనందమే పథకం విజయానికి నిదర్శనమని తెలిపారు. పేదలకు గౌరవప్రదమైన జీవనం కల్పించడం, సామాజిక సమానత్వాన్ని సాధించడం ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కేవలం నివాసం కల్పించడం మాత్రమే కాకుండా గ్రామీణాభివృద్ధికి దోహదపడే కీలక చర్య అని వివరించారు.ప్రతి అర్హుడైన నిరుపేదకు సొంత ఇల్లు అందే వరకు ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. కొత్త ఇళ్లలోకి ప్రవేశించిన లబ్ధిదారుల ఇళ్ల వద్ద పండుగ వాతావరణం నెలకొంది. “సొంత ఇల్లు మా జీవితకాల స్వప్నం. ఇందిరమ్మ పథకం ద్వారా అది నెరవేరింది” అంటూ లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేశారు.కార్యక్రమంలో చిట్యాల ఇన్‌చార్జ్ ఎంఆర్ఓ విజయలక్ష్మి, ఎంపీడీవో జయలక్ష్మి, వివిధ శాఖల అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నాణ్యతతో గృహాల నిర్మాణం పూర్తి చేసినందుకు కలెక్టర్ అధికారులను అభినందించారు.

Sthanikam

ఇందిరమ్మ ఇళ్లతో పేదల జీవితాల్లో వెలుగులు

Article Image

మీ స్పందన? 2 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News