Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కాంగ్రెస్ నేతల అరెస్టు అప్రజాస్వామికం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 11:31 AM

ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలి. వాసలమర్రిలో పురోగతిని పరిశీలించిన కలెక్టర్ అనురాగ్ జయంతి

08-06-2026 34 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

తుర్కపల్లి మండలం వాసలమర్రి గ్రామంలో అమలవుతున్న ఇందిరమ్మ ఇండ్ల పథకం పురోగతిని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి సోమవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

గ్రామంలో మంజూరైన ఇందిరమ్మ ఇండ్ల సంఖ్య, పూర్తయిన ఇళ్లు, నిర్మాణ దశలో ఉన్న ఇళ్లు, ఇంకా ప్రారంభం కాని ఇళ్ల వివరాలను సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. మంజూరైన ప్రతి ఇల్లు నిర్దేశిత గడువులోగా పూర్తి అయ్యేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

మొదటి విడతలో ఇందిరమ్మ ఇల్లు మంజూరైనప్పటికీ నిర్మాణ పనులు ప్రారంభించని లబ్ధిదారుల ఇళ్లను సందర్శించిన కలెక్టర్, వారితో నేరుగా మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. గృహ నిర్మాణం ప్రారంభించడంలో ఎదురవుతున్న ఇబ్బందులను పరిష్కరించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని లబ్ధిదారులు వెంటనే ఇళ్ల నిర్మాణ పనులు ప్రారంభించాలని కోరారు.

గ్రామంలో ఇంకా ఇందిరమ్మ ఇండ్లకు అర్హులైన కుటుంబాల సంఖ్య, ఎల్-2 కేటగిరీలో ఉన్న లబ్ధిదారుల వివరాలు, గృహ నిర్మాణానికి వారి సంసిద్ధతపై సమాచారం సేకరించి ప్రభుత్వానికి పంపినట్లు తెలిపారు. అర్హులైన ప్రతి నిరుపేద కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందేలా అధికారులు క్షేత్రస్థాయిలో పనిచేయాలని కలెక్టర్ సూచించారు.

ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

Sthanikam

ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలి. వాసలమర్రిలో పురోగతిని పరిశీలించిన కలెక్టర్ అనురాగ్ జయంతి

Article Image

తుర్కపల్లి మండలం వాసలమర్రి గ్రామంలో అమలవుతున్న ఇందిరమ్మ ఇండ్ల పథకం పురోగతిని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి సోమవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

గ్రామంలో మంజూరైన ఇందిరమ్మ ఇండ్ల సంఖ్య, పూర్తయిన ఇళ్లు, నిర్మాణ దశలో ఉన్న ఇళ్లు, ఇంకా ప్రారంభం కాని ఇళ్ల వివరాలను సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. మంజూరైన ప్రతి ఇల్లు నిర్దేశిత గడువులోగా పూర్తి అయ్యేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

మొదటి విడతలో ఇందిరమ్మ ఇల్లు మంజూరైనప్పటికీ నిర్మాణ పనులు ప్రారంభించని లబ్ధిదారుల ఇళ్లను సందర్శించిన కలెక్టర్, వారితో నేరుగా మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. గృహ నిర్మాణం ప్రారంభించడంలో ఎదురవుతున్న ఇబ్బందులను పరిష్కరించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని లబ్ధిదారులు వెంటనే ఇళ్ల నిర్మాణ పనులు ప్రారంభించాలని కోరారు.

గ్రామంలో ఇంకా ఇందిరమ్మ ఇండ్లకు అర్హులైన కుటుంబాల సంఖ్య, ఎల్-2 కేటగిరీలో ఉన్న లబ్ధిదారుల వివరాలు, గృహ నిర్మాణానికి వారి సంసిద్ధతపై సమాచారం సేకరించి ప్రభుత్వానికి పంపినట్లు తెలిపారు. అర్హులైన ప్రతి నిరుపేద కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందేలా అధికారులు క్షేత్రస్థాయిలో పనిచేయాలని కలెక్టర్ సూచించారు.

ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News