Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
18 కాలనీల డంపింగ్‌ యార్డ్‌ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలి. టీపీసీసీ ప్రధాన కార్యదర్శి పృథ్వీ చౌదరి. దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 09:28 AM

ఇంధన ధరల పెంపుపై సీపీఎం నిరసన. ఎర్రుపాలెంలో కేంద్ర దిష్టిబొమ్మ దహనం

18-05-2026 37 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ఎర్రుపాలెం, : పెట్రోల్‌, డీజిల్‌ ధరల పెంపుతో సామాన్య ప్రజలపై తీవ్ర భారం పడుతోందని సీపీఎం మండల కార్యదర్శి మద్దాల ప్రభాకరరావు విమర్శించారు. పెంచిన ఇంధన ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు.

సోమవారం మండల కేంద్రంలోని రింగ్‌ సెంటర్‌లో సీపీఎం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించి కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్యాస్‌, ఇంధన ధరల పెరుగుదలతో పరిశ్రమలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని, కార్మికులు ఉపాధి కోల్పోతున్నారని అన్నారు.

ఇంధన ధరల పెరుగుదలతో రవాణా ఖర్చులు పెరిగి నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఐదు రాష్ట్రాల ఎన్నికలు పూర్తయ్యాక కేంద్ర ప్రభుత్వం ప్రజలపై భారాన్ని మోపిందని ఆరోపించారు.

పొదుపు చర్యలు పాటించాలని ప్రధాని చేస్తున్న సూచనలు ప్రజల ఇబ్బందులను పట్టించుకోనట్టేనని విమర్శించారు. పెరిగిన ధరలను భరించాలంటూ ప్రజలకు సూచించడం సరైన విధానం కాదన్నారు.

కార్యక్రమంలో గామాసు జోగయ్య, ఆంగోతు వెంకటేశ్వర్లు, నాగులవంచ వెంకట్రామయ్య, షేక్ లాలా, కన్నెబోయిన శ్రీను, దేవరకొండ రామకృష్ణ, షేక్ మస్తాన్, నక్క పుల్లారావు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

ఇంధన ధరల పెంపుపై సీపీఎం నిరసన. ఎర్రుపాలెంలో కేంద్ర దిష్టిబొమ్మ దహనం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News