Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
18 కాలనీల డంపింగ్‌ యార్డ్‌ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలి. టీపీసీసీ ప్రధాన కార్యదర్శి పృథ్వీ చౌదరి. దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 08:28 AM

ఇంధన ధరల పెంపుపై సీపీఐ నిరసన పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు తగ్గించాలి.

16-05-2026 48 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ఆదోని, పెంచిన పెట్రోలు, డీజిల్, వంట గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని కోరుతూ భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) ఆధ్వర్యంలో శుక్రవారం స్థానిక తిమ్మారెడ్డి బస్టాండ్ సర్కిల్ వద్ద పెద్దఎత్తున నిరసన కార్యక్రమం నిర్వహించారు.

సీపీఐ పట్టణ సహాయ కార్యదర్శి రమేష్‌కుమార్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఎస్. సుదర్శన్, డీహెచ్‌పీఎస్ జిల్లా నాయకులు విజయ్‌కుమార్ మాట్లాడుతూ ఎన్నికల ముందు ఎలాంటి చార్జీలు పెంచబోమని హామీ ఇచ్చిన బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పేద ప్రజలపై భారాలు మోపుతోందని విమర్శించారు.

పెట్రోల్‌పై రూ.3.29, డీజిల్‌పై రూ.3.14, గ్యాస్ ధరపై రూ.2 పెంచడం వల్ల అన్ని వర్గాల ప్రజలపై తీవ్ర భారం పడుతోందన్నారు. కష్టపడి పనిచేసినా కడుపునిండని నిరుపేదలపై కేంద్ర ప్రభుత్వం మరింత భారం మోపుతోందని ఆరోపించారు. వెంటనే పెంచిన ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు.

కార్యక్రమంలో ఏఐవైఎఫ్ పట్టణ కార్యదర్శి అంజిత్ గౌడ్, కె. లింగప్ప, వైటీ వీరవరప్రసాద్, ఎం. పరశురాం, ఉరుకుందు నాయకులు వైటీ ఆది, రామాంజనేయులు, అంజి తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

ఇంధన ధరల పెంపుపై సీపీఐ నిరసన పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు తగ్గించాలి.

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News