Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
18 కాలనీల డంపింగ్‌ యార్డ్‌ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలి. టీపీసీసీ ప్రధాన కార్యదర్శి పృథ్వీ చౌదరి. దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 08:23 AM

ఇంధన ధరల పెంపు ఉపసంహరించాలి జీఎస్టీ పరిధిలోకి తేవాలి. సీపీఎం

16-05-2026 29 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

భువనగిరి టౌన్, : పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరల పెంపును వెంటనే ఉపసంహరించుకొని జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని సీపీఎం పట్టణ కార్యదర్శి మాయ కృష్ణ డిమాండ్ చేశారు. సీపీఎం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం జిల్లా కేంద్రంలోని రైతుబజార్ వద్ద కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటికే యుద్ధ పరిస్థితుల పేరుతో నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగాయని, సామాన్యులు, ఉద్యోగులు, పేదలపై తీవ్ర భారం పడుతోందన్నారు. రోజువారీ కూలీలు, ఉద్యోగుల జీతాలు పెరగని పరిస్థితిలో ఇంధన ధరల పెంపు ప్రజల నడ్డి విరిచేలా ఉందని విమర్శించారు.

పెట్రోల్, డీజిల్ ధరల పెంపుతో ఇతర వస్తువుల ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని, వెంటనే పెంచిన ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు. ఇతర రాష్ట్రాల్లో ఎన్నికలు పూర్తయ్యాక పది రోజుల్లోనే ధరలు పెంచడం ప్రజలను మభ్యపెట్టడమేనని ఆరోపించారు. పెంచిన ధరలు ఉపసంహరించుకోకపోతే దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు.

కార్యక్రమంలో సీపీఎం పట్టణ కార్యవర్గ సభ్యులు బందల ఎల్లయ్య, వనం రాజు, కమిటీ సభ్యులు వల్లాస్ అంజయ్య, చింతల శివ, ఈర్ల రాహుల్, జూకంటి పావుల్, జగ్గులు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

ఇంధన ధరల పెంపు ఉపసంహరించాలి జీఎస్టీ పరిధిలోకి తేవాలి. సీపీఎం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News