Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 03:37 AM

ఇంద్రపాలనగరం లో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు

14-04-2026 243 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ఇంద్రపాలనగరం గ్రామంలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామపంచాయతి కార్యాలయంలో అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి స్థానిక ప్రజాప్రతినిధులు నివాళులు అర్పించారు.

అనంతరం గ్రామ ప్రధాన రహదారిలో ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద అంబేద్కర్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొని పూలమాలలు వేసి గౌరవ నివాళులు అర్పించారు. అలాగే మాలవాడలోని అంబేద్కర్ విగ్రహం వద్ద జరిగిన జయంతి కార్యక్రమాల్లో కూడా పాల్గొని ఆయన సేవలను స్మరించుకున్నారు.

ఈ కార్యక్రమాల్లో సర్పంచ్ గర్ధాస్ విక్రమ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కార్యక్రమం అనంతరం రామన్నపేట సీఐ వెంకటేశ్వర్లు, ఎస్‌ఐ నాగరాజు గ్రామ ప్రజలకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించడం ద్వారా ప్రమాదాలను నివారించవచ్చని సూచించారు.

ఈ వేడుకల్లో ఉపసర్పంచ్ నల్ల జయసుధ స్వామి, వార్డ్ సభ్యులు, అంబేద్కర్ ఉత్సవ కమిటీ సభ్యులు, పంచాయతీ సెక్రటరీ రసూల్, అమినోద్ధిన్, నర్సింహా, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు

Sthanikam

ఇంద్రపాలనగరం లో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News