Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
విద్యార్థుల ప్రాథమిక నైపుణ్యాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి: జిల్లా కలెక్టర్ “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 29, 2026 10:02 PM

హుజూర్నగర్ పారామెడికల్, ల్యాబ్ టెక్నీషియన్ సంఘం అధ్యక్షుడిగా గుండు వెంకటేశ్వర్లు ఏకగ్రీవ ఎన్నిక

17-02-2026 70 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

కోదాడలో జరిగిన రాష్ట్ర స్థాయి సమావేశంలో కార్యవర్గం ఎంపిక

హుజూర్నగర్ నియోజకవర్గ పారామెడికల్ మరియు ల్యాబ్ టెక్నీషియన్ సంఘం అధ్యక్షుడిగా హుజూర్నగర్‌కు చెందిన గుండు వెంకటేశ్వర్లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. దక్షిణ భారతదేశంలోని తెలుగు రాష్ట్రాలు అయిన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలకు చెందిన ల్యాబ్ యజమానులు, ల్యాబ్ సాంకేతిక నిపుణులు అనేక దశాబ్దాలుగా రాష్ట్ర స్థాయి నుండి పట్టణ స్థాయి వరకు సమగ్ర సంఘం లేక ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారు. సమస్యల పరిష్కారం కోసం చర్చలు, సమావేశాలు, సదస్సులు నిర్వహించిన అనంతరం హైదరాబాద్ కేంద్రంగా “తెలంగాణ పారామెడికల్ మరియు ల్యాబ్ టెక్నీషియన్ సంఘం” పేరుతో సంస్థను ఏర్పాటు చేశారు.

ఈ నేపథ్యంలో కోదాడలో జరిగిన రాష్ట్ర స్థాయి సమావేశంలో రాష్ట్ర అధ్యక్షుడు పి. వీరయ్య, కార్యనిర్వాహక అధ్యక్షుడు కిన్నెర రవీంద్ర, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గార్ల అజయ్ ఆధ్వర్యంలో హుజూర్నగర్ మరియు కోదాడ నియోజకవర్గ స్థాయి కార్యవర్గ ఎన్నికలు నిర్వహించారు. హుజూర్నగర్ నియోజకవర్గ స్థాయి సంఘం అధ్యక్షుడిగా గుండు వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శిగా కోల నవీన్, సంయుక్త కార్యదర్శిగా పి. నాగరాజు, ఖజాంచీగా డి. నరేందర్, కార్యవర్గ సభ్యులుగా కే. సాయి, షరీఫ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

అనంతరం ఎన్నికైన కార్యవర్గ సభ్యులను రాష్ట్ర కమిటీ ప్రతినిధులు సన్మానించి అభినందించారు. సంఘం బలోపేతానికి కృషి చేయాలని సూచించారు.

Sthanikam

హుజూర్నగర్ పారామెడికల్, ల్యాబ్ టెక్నీషియన్ సంఘం అధ్యక్షుడిగా గుండు వెంకటేశ్వర్లు ఏకగ్రీవ ఎన్నిక

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News