Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డివైఎఫ్ఐ రాష్ట్ర మహాసభలకు సన్నద్ధం కావాలి ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 03:59 PM

హృద్రోగికి పునర్జన్మ.. ఆఫ్-పంప్ బైపాస్ విజయవంతం....

13-03-2026 41 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada Reporter
Harish reporter

తీవ్రమైన గుండె జబ్బుతో పాటు దీర్ఘకాలిక సమస్యలతో బాధపడుతున్న 61 ఏళ్ల మహిళకు మలక్‌పేట్ యశోదా హాస్పిటల్‌లో అత్యంత క్లిష్టమైన శస్త్రచికిత్స నిర్వహించి ప్రాణాలు కాపాడినట్లు ప్రముఖ గుండె శస్త్రచికిత్స నిపుణులు డాక్టర్ వెంగల్ రెడ్డి తెలిపారు. గురువారం కోదాడ పబ్లిక్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రధాన రక్తనాళాల్లో అడ్డంకులు ఉండటం, షుగర్, బీపీ వంటి సమస్యల వల్ల ఈ కేసు అత్యంత ప్రమాదకరంగా మారిందన్నారు. గుండెను ఆపకుండా నిర్వహించే 'ఆఫ్-పంప్' పద్ధతిలో బైపాస్ శస్త్రచికిత్స చేసి రోగిని ప్రాణాపాయం నుంచి రక్షించామన్నారు. శస్త్రచికిత్స జరిగిన రోజే వెంటిలేటర్ తొలగించామని, ప్రస్తుతం ఆమె పూర్తి ఆరోగ్యంతో ఉన్నారని వివరించారు. అత్యాధునిక సాంకేతికత, అనుభవజ్ఞులైన వైద్య బృందంతో ఎంతటి క్లిష్టమైన కేసులనైనా విజయవంతంగా పూర్తి చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. ప్రజలందరూ అన్ని రకాల వసతులు, వైద్య బృందం ఉన్న ఆసుపత్రులలో చికిత్స చేసుకోవాలన్నారు. అతి త్వరలోనే జర్నలిస్టులు వారి కుటుంబ సభ్యులకు కోదాడలో మెగా ఉచిత ఆరోగ్య శిబిరాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో డీజీఎం లక్ష్మణ్ శ్రీకాంత్, సీనియర్ మేనేజర్ వాసు కిరణ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు........

Sthanikam

హృద్రోగికి పునర్జన్మ.. ఆఫ్-పంప్ బైపాస్ విజయవంతం....

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News