Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 12:37 PM

హిందూ విశ్వాసాల పట్ల జగన్‌కు చిన్నచూపు రంగేపల్లి వెంకటరమణ

24-02-2026 29 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Penukonda
EDIGA NAVEENKUMAR

శ్రీ సత్యసాయి జిల్లా సోమందేపల్లిలో

హిందూమత విశ్వాసాలు, తిరుమల తిరుపతి దేవస్థానం సంప్రదాయాల పట్ల మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి నిర్లక్ష్య ధోరణి ప్రదర్శించారని రాష్ట్ర సగర ఉప్పర కార్పొరేషన్ ఛైర్మన్ రంగేపల్లి వెంకటరమణ ఆరోపించారు. సోమందేపల్లి మండల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన పత్రికా సమావేశంలో ఆయన మాట్లాడారు.

జగన్‌రెడ్డి, వైసీపీ నేతలు దేవుడి పేరును రాజకీయ ప్రయోజనాలకు వినియోగించుకున్నారని విమర్శించారు. కలియుగ దైవం వెంకటేశ్వర స్వామివారి చిత్రాలతో రాజకీయ నినాదాలు చేయడం అనుచితమని పేర్కొన్నారు. టీటీడీ ఆస్తులు, నిధుల వినియోగంలో అవకతవకలు జరిగాయని ఆరోపించారు.

ఎన్నికల సమయంలో లడ్డూల పంపిణీ, సేవా–దర్శన టిక్కెట్లలో అక్రమాలు, తలనీలాల వ్యవహారంలో లోపాలు చోటుచేసుకున్నాయని అన్నారు. రామ్మందిర్ అయోధ్య విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం సందర్భంలోనూ వివాదాలు తలెత్తినట్లు పేర్కొన్నారు.

హిందూ దేవాలయాల పరిరక్షణలో వైఫల్యం స్పష్టమైందని విమర్శించారు.

ఈ సమావేశంలో స్థానిక పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Sthanikam

హిందూ విశ్వాసాల పట్ల జగన్‌కు చిన్నచూపు రంగేపల్లి వెంకటరమణ

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News