Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 07:39 AM

హెల్మెట్ ధరించని వాహనదారులపై వినూత్న ప్రయత్నం చేసిన చాట్రాయి ఎస్ఐ డి రామకృష్ణ

11-02-2026 110 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం కృష్ణారావుపాలెం గ్రామంలో ఎస్ఐ రామ కృష్ణ వారి సిబ్బంది తో కలిసి హెల్మెట్ లేని వాహనదారులకు జరిమానా బదులు హెల్మెట్ లు కొనుగోలు చేయించి ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్ లు వల్ల కలిగే ఉపయోగాలను గురించి అవగాహన కల్పించారు ఎస్ఐ డి రామకృష్ణ రహదారి భద్రతపై వినూత్న కార్యక్రమాన్ని చేపట్టారు. జరిమానా కాదు.ప్రాణ రక్షణే ముఖ్యం.సాధారణంగా హెల్మెట్ లేని వాహనదారులకు జరిమానాలు విధించడం సహజం. అయితే చాట్రాయి ఎస్ఐ ఒక అడుగు ముందుకు వేసి, కేవలం జరిమానాతో సరి పెట్టకుండా సామాజిక బాధ్యతతో వ్యవహరించారు.

హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తున్న వారిని ఆపి, వారికి అక్కడికక్కడే కౌన్సిలింగ్ ఇచ్చారు.హెల్మెట్ ధరించక పోవడం వల్ల కలిగే ప్రమాదాలను వివరించి, వారిచేత తక్షణమే హెల్మెట్ల ను కొనుగోలు చేయించారు.ఈ సందర్భంగా ఎస్ఐ డి రామకృష్ణ మాట్లాడుతూ

హెల్మెట్ భారం కాదు ఆది ప్రాణ రక్ష అని ద్విచక్ర వాహనదారులు తలపై హెల్మెట్ ధరించడం భారం అని భావించకూడదని, అది ప్రాణానికి శ్రీరామ రక్ష వంటిదని, ప్రమాదం జరిగి నప్పుడు తలకు తగిలే చిన్న దెబ్బ కూడా ప్రాణాంతకం కావచ్చు, ఆ సమయంలో హెల్మెట్ కాపాడుతుందని,

వాహనాలు నడిపే సమయాలలో కుటుంబ బాధ్యత గుర్తుంచుకొని వాహనంపై బయటకు వెళ్ళినప్పుడు, క్షేమం కోసం కుటుంబ సభ్యులు ఇంటి వద్ద వేచి ఉంటారని, ఏదైనా అపశ్రుతి జరిగితే ఆ కుటుంబం మొత్తం రోడ్డున పడుతుందని తమ కోసం కాకపోయినా, తమ కుటుంబం కోసం హెల్మెట్ ధరించాలని, ప్రమాదాలకు గురవు తున్న వారిలో అత్యధిక శాతం యువతే ఉంటున్నారని, సరైన రక్షణ లేకపోవడం వల్ల విలువైన ప్రాణాలు గాలి లో కలిసి పోతున్నాయని, వేగాన్ని తగ్గించి, రక్షణ కవచమైన హెల్మెట్‌ను విధిగా ధరించాలని కోరారు

Sthanikam

హెల్మెట్ ధరించని వాహనదారులపై వినూత్న ప్రయత్నం చేసిన చాట్రాయి ఎస్ఐ డి రామకృష్ణ

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News