Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
18 కాలనీల డంపింగ్‌ యార్డ్‌ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలి. టీపీసీసీ ప్రధాన కార్యదర్శి పృథ్వీ చౌదరి. దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 09:29 AM

హెచ్‌పీఎస్‌లో ఎస్సీ విద్యార్థులకు అవకాశం. మొదటి తరగతి ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

18-05-2026 49 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

భువనగిరి : హైదరాబాద్‌ పబ్లిక్‌ స్కూల్‌ (రామంతాపూర్‌)లో 2026–27 విద్యాసంవత్సరానికి ఎస్సీ విద్యార్థుల మొదటి తరగతి డే స్కాలర్‌ ప్రవేశాల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా షెడ్యూల్డ్‌ కులాల అభివృద్ధి అధికారి పి. సాహితి తెలిపారు.

యాదాద్రి భువనగిరి జిల్లాకు ఒక సీటు కేటాయించినట్లు వెల్లడించారు. అర్హులైన విద్యార్థుల తల్లిదండ్రులు ఈ నెల 29 వరకు జిల్లా ఎస్సీ అభివృద్ధి శాఖ కార్యాలయంలో దరఖాస్తులు సమర్పించాలని సూచించారు.

అభ్యర్థులు యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన వారై ఉండాలని, 2019 జూన్‌ 1 నుంచి 2020 మే 31 మధ్య జన్మించి ఉండాలని పేర్కొన్నారు. జనన ధ్రువీకరణ పత్రం, కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలను మీ సేవ, మున్సిపాలిటీ లేదా తహసీల్దార్‌ కార్యాలయాల నుంచి పొందాలని తెలిపారు.

గ్రామీణ ప్రాంతాల అభ్యర్థుల తల్లిదండ్రుల వార్షిక ఆదాయం రూ.1.50 లక్షలు, పట్టణ ప్రాంతాల వారికి రూ.2 లక్షలు మించకూడదన్నారు. జూన్‌ 1న కలెక్టరేట్‌లో లాటరీ విధానంలో ఎంపిక నిర్వహించనున్నట్లు వెల్లడించారు.

వివరాలు, దరఖాస్తు ఫారాల కోసం కలెక్టరేట్‌ కాంప్లెక్స్‌లోని జిల్లా ఎస్సీ అభివృద్ధి శాఖ కార్యాలయాన్ని సంప్రదించాలని సూచించారు.

Sthanikam

హెచ్‌పీఎస్‌లో ఎస్సీ విద్యార్థులకు అవకాశం. మొదటి తరగతి ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

Article Image

భువనగిరి : హైదరాబాద్‌ పబ్లిక్‌ స్కూల్‌ (రామంతాపూర్‌)లో 2026–27 విద్యాసంవత్సరానికి ఎస్సీ విద్యార్థుల మొదటి తరగతి డే స్కాలర్‌ ప్రవేశాల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా షెడ్యూల్డ్‌ కులాల అభివృద్ధి అధికారి పి. సాహితి తెలిపారు.

యాదాద్రి భువనగిరి జిల్లాకు ఒక సీటు కేటాయించినట్లు వెల్లడించారు. అర్హులైన విద్యార్థుల తల్లిదండ్రులు ఈ నెల 29 వరకు జిల్లా ఎస్సీ అభివృద్ధి శాఖ కార్యాలయంలో దరఖాస్తులు సమర్పించాలని సూచించారు.

అభ్యర్థులు యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన వారై ఉండాలని, 2019 జూన్‌ 1 నుంచి 2020 మే 31 మధ్య జన్మించి ఉండాలని పేర్కొన్నారు. జనన ధ్రువీకరణ పత్రం, కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలను మీ సేవ, మున్సిపాలిటీ లేదా తహసీల్దార్‌ కార్యాలయాల నుంచి పొందాలని తెలిపారు.

గ్రామీణ ప్రాంతాల అభ్యర్థుల తల్లిదండ్రుల వార్షిక ఆదాయం రూ.1.50 లక్షలు, పట్టణ ప్రాంతాల వారికి రూ.2 లక్షలు మించకూడదన్నారు. జూన్‌ 1న కలెక్టరేట్‌లో లాటరీ విధానంలో ఎంపిక నిర్వహించనున్నట్లు వెల్లడించారు.

వివరాలు, దరఖాస్తు ఫారాల కోసం కలెక్టరేట్‌ కాంప్లెక్స్‌లోని జిల్లా ఎస్సీ అభివృద్ధి శాఖ కార్యాలయాన్ని సంప్రదించాలని సూచించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News