Sthanikam - Truth Matters
Logo
Home / ప్రాంతీయ వార్తలు / నారాయణఖేడ్

హ్యూమన్ రైట్స్ సంగారెడ్డి జిల్లా ఎగ్జిక్యూటివ్ మెంబర్‌గా గైని ప్రభాకర్ నియామకం

Updated : 23 Jan 2026 15:59 IST
As Preferred Source 1 min read
హ్యూమన్ రైట్స్ సంగారెడ్డి జిల్లా ఎగ్జిక్యూటివ్ మెంబర్‌గా గైని ప్రభాకర్ నియామకం

నారాయణఖేడ్ స్థానికం ప్రతినిధి కృష్ణ

నారాయణఖేడ్ నియోజకవర్గం పరిధిలోని నారాయణఖేడ్ మున్సిపల్ కేంద్రంలో శుక్రవారం హ్యూమన్ రైట్స్ సోషల్ జస్టిస్ సోషల్ సర్వీస్ ఫర్ చేంజ్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో సంగారెడ్డి జిల్లా కమిటీ సమావేశం ఘనంగా నిర్వహించబడింది. ఈ సమావేశంలో సంస్థ సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు బైండ్ల కృష్ణ, జిల్లా ప్రధాన కార్యదర్శి అఖిల్ పాల్గొని, సంగారెడ్డి జిల్లా ఎగ్జిక్యూటివ్ మెంబర్‌గా గైని ప్రభాకర్‌ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు.ఈ కార్యక్రమంలో అధ్యక్షులు బైండ్ల కృష్ణ మాట్లాడుతూ, సమాజంలో ప్రతి ఒక్కరూ విద్య, వైద్యం, ఆరోగ్యం, న్యాయం, రెవెన్యూ తదితర సమస్యలపై అవగాహన కలిగి ఉండాల్సిన అవసరం ఉందన్నారు. ముఖ్యంగా మానవ హక్కులు, మహిళా రక్షణ చట్టాలపై ప్రజలకు అవగాహన కల్పించేలా సదస్సులు, కార్యక్రమాలు నిర్వహించాలని ఆయన కోరారు. ఇలాంటి కార్యక్రమాల ద్వారా అణగారిన వర్గాలకు న్యాయం చేకూర్చేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.ఈ సమావేశంలో హ్యూమన్ రైట్స్ న్యాల్‌కల్ మండల అధ్యక్షులు బి. నవీన్ కుమార్‌తో పాటు నేషనల్ హ్యూమన్ రైట్స్ చెందిన పలువురు సభ్యులు, కార్యకర్తలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

Sthanikam

హ్యూమన్ రైట్స్ సంగారెడ్డి జిల్లా ఎగ్జిక్యూటివ్ మెంబర్‌గా గైని ప్రభాకర్ నియామకం

Article Image

మరిన్ని

మీ స్పందన? 3 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Latest news