Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జన్మదిన వేడుకలు రద్దు.. మృతుడి కుటుంబానికి రూ.8 లక్షల సాయం అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 05:59 AM

హయత్‌నగర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జాతీయ గణిత దినోత్సవం ఘన నిర్వహణ

23-12-2025 72 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

జాతీయ గణిత దినోత్సవం సందర్భంగా రామానుజన్ జయంతి వేడుకలు

స్థానికం ప్రతినిధి

హయత్‌నగర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శ్రీనివాస రామానుజన్ జయంతి సందర్భంగా గణిత విభాగం ఆధ్వర్యంలో జాతీయ గణిత శాస్త్ర దినోత్సవాన్ని సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఇన్‌ఛార్జ్ ప్రిన్సిపాల్ వి. శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ డిసెంబర్ 22న జాతీయ గణిత దినోత్సవాన్ని ప్రపంచ ప్రఖ్యాత గణిత మేధావి శ్రీనివాస రామానుజన్ పుట్టినరోజును పురస్కరించుకుని జరుపుకుంటామని తెలిపారు. గణిత ప్రాముఖ్యతను చాటడం, విద్యార్థుల్లో గణితంపై ఆసక్తిని పెంపొందించడం, దేశంలోని గొప్ప గణిత సంప్రదాయాన్ని ప్రోత్సహించడం ఈ దినోత్సవ ప్రధాన ఉద్దేశమని అన్నారు. సైన్స్, సాంకేతికత, ఆర్థికశాస్త్ర రంగాల్లో గణితం కీలక పాత్ర పోషిస్తుందని వివరించారు. రామానుజన్ చేసిన అపూర్వ కృషిని స్మరించుకుంటూ గణితాన్ని కష్టమైన సబ్జెక్టుగా కాకుండా రోజువారీ జీవితంలో ఉపయోగపడే సాధనంగా చూడాలన్నారు.

ఈ సందర్భంగా గణిత సహాయ ఆచార్యులు ఎన్. నరసింహ మాట్లాడుతూ సంఖ్యా శాస్త్రం, అనంత శ్రేణులు, మాక్ థీటా ఫంక్షన్లు, అవిచ్ఛిన్న భిన్నాలు వంటి పరిశోధనా రంగాల ప్రాధాన్యతను వివరించారు. అలాగే గాస్, జాకోబి, యూలర్ వంటి సమకాలీన గణిత శాస్త్రవేత్తల కృషిపై కూడా ప్రసంగించారు.

జాతీయ గణిత దినోత్సవాన్ని పురస్కరించుకుని విద్యార్థులకు వ్యాసరచన, గణిత క్విజ్ పోటీలను నిర్వహించి, విజేతలకు బహుమతులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో అకడమిక్ కోఆర్డినేటర్ డాక్టర్ బి. నరసింహ, ఐక్యూఏసి కోఆర్డినేటర్ డాక్టర్ మధు, డాక్టర్ మక్లా, విద్యాసాగర్, రమాదేవి, పెదయ్య తదితర అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Sthanikam

హయత్‌నగర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జాతీయ గణిత దినోత్సవం ఘన నిర్వహణ

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News