Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
18 కాలనీల డంపింగ్‌ యార్డ్‌ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలి. టీపీసీసీ ప్రధాన కార్యదర్శి పృథ్వీ చౌదరి. దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 09:25 AM

హయత్‌నగర్ డిగ్రీ కళాశాలలో ముగిసిన విద్యా వారోత్సవాలు

17-05-2026 39 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

హయత్‌నగర్: తెలంగాణ ప్రభుత్వ ‘99 రోజుల ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక’లో భాగంగా హయత్‌నగర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నిర్వహించిన విద్యా వారోత్సవాలు ఆదివారం ఘనంగా ముగిశాయి. వారం రోజుల పాటు నిర్వహించిన కార్యక్రమాల్లో విద్యార్థులు సాంస్కృతిక ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు.

కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పి. సురేష్‌బాబు మాట్లాడుతూ విద్యార్థులు పుస్తక జ్ఞానంతో పాటు సాంకేతిక పరిజ్ఞానం, సామాజిక సేవ, నైపుణ్యాభివృద్ధి రంగాల్లోనూ ప్రావీణ్యం సాధించాలని సూచించారు. విద్యా వారోత్సవాలు విద్యార్థుల్లో నూతన ఉత్సాహాన్ని నింపాయని తెలిపారు.

ఈ సందర్భంగా చదువులో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులతో పాటు రాష్ట్ర, జాతీయ స్థాయి క్రీడలు, ఎన్‌సీసీ, ఎన్‌ఎస్‌ఎస్‌, సాంస్కృతిక కార్యక్రమాల్లో ప్రతిభ చూపిన విద్యార్థులను బహుమతులతో సత్కరించారు. తెలంగాణ పీజీసెట్‌లో రాష్ట్రస్థాయిలో రెండో ర్యాంక్ సాధించిన తేజశ్రీ, తెలంగాణ హైకోర్టులో ఉద్యోగం సాధించిన అనిల్‌కుమార్‌లను ప్రత్యేకంగా అభినందించారు.

కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ ఇందిర, అకాడమిక్ కోఆర్డినేటర్ డాక్టర్ బి. నరసింహ, ఐక్యూఏసీ కోఆర్డినేటర్ డాక్టర్ డి. మధు, సీనియర్ అధ్యాపకులు డాక్టర్ ఎస్. సుబ్రహ్మణ్యం, సాంస్కృతిక విభాగం సమన్వయకర్త డాక్టర్ అపర్ణాచతుర్వేది, ఎన్‌ఎస్‌ఎస్‌ ప్రోగ్రాం ఆఫీసర్లు డాక్టర్ ఈ. యాదగిరిరెడ్డి, డాక్టర్ ఎస్. శారద తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

హయత్‌నగర్ డిగ్రీ కళాశాలలో ముగిసిన విద్యా వారోత్సవాలు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News