Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
18 కాలనీల డంపింగ్‌ యార్డ్‌ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలి. టీపీసీసీ ప్రధాన కార్యదర్శి పృథ్వీ చౌదరి. దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 08:21 AM

హయత్ నగర్ లో పూర్వ విద్యార్థుల సమావేశం

హయత్ నగర్ లో పూర్వ విద్యార్థుల సమావేశం

హయత్ నగర్ లో పూర్వ   విద్యార్థుల సమావేశం
14-05-2026 41 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

హయత్‌నగర్: విద్యా వారోత్సవాల్లో భాగంగా ప్రభుత్వ డిగ్రీ కళాశాల హయత్‌నగర్‌లో గురువారం పూర్వ విద్యార్థుల సమావేశం నిర్వహించారు. కళాశాలలో డిగ్రీ పూర్తి చేసి వివిధ రంగాల్లో స్థిరపడిన పూర్వ విద్యార్థులను ఆహ్వానించి విద్యార్థుల సంఘం బాధ్యులను సన్మానించారు. ఈ సందర్భంగా డాక్టర్ సురేష్‌బాబు మాట్లాడుతూ పూర్వ విద్యార్థుల సంఘం విద్యార్థుల ప్రగతి, కళాశాల అభివృద్ధికి తోడ్పడుతోందన్నారు.

పూర్వ విద్యార్థుల సంఘం కోఆర్డినేటర్ డాక్టర్ శివపురం సుబ్రమణ్యం మాట్లాడుతూ కళాశాలలో చదివిన ప్రతి విద్యార్థి అభివృద్ధికి కళాశాల చేయూతనిస్తుందని తెలిపారు. రాబోయే రోజుల్లో పూర్వ విద్యార్థుల సంఘం మరింత బలపడాల్సిన అవసరం ఉందన్నారు.

సంఘం అధ్యక్షుడు, కార్యదర్శి చెరుకూరి మధు మాట్లాడుతూ కళాశాల అభివృద్ధికి తమ సంఘం కట్టుబడి ఉంటుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ ఇందిరా, అధ్యాపకులు, పూర్వ విద్యార్థుల సంఘం ప్రతినిధులు వేణుగోపాల్, శేఖర్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు

Sthanikam

హయత్ నగర్ లో పూర్వ విద్యార్థుల సమావేశం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News