Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 04:48 AM

హామీలు అమలు చేయడంలో కాంగ్రెస్ విఫలం

హామీలు అమలు చేయడంలో కాంగ్రెస్ విఫలం

హామీలు అమలు చేయడంలో కాంగ్రెస్ విఫలం
09-01-2026 64 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

మళ్లీ వచ్చేది కేసీఆర్ ప్రభుత్వమే

మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డి

సూర్యాపేట జిల్లా స్థానికం ప్రతినిధి బిక్షం

కాంగ్రెస్ పార్టీ మళ్లీ గెలవదని అర్థమైపోయిందని, అందుకే రాష్ట్రంలో అడ్డూ అదుపు లేని పాలన సాగుతోందనిమాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. జిల్లా కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన సూర్యాపేట నియోజకవర్గం ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన కాంగ్రెస్ ప్రభుత్వ పాలన తీరుపై నిప్పులు చెరిగారు. “ఎట్లున్న రాష్ట్రం ఎట్లాయిందో ప్రజలు చూస్తూనే ఉన్నారు” అంటూ వ్యాఖ్యానించారు. కేసీఆర్ పదేళ్ల పాలనలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందని, కానీ ఈ రెండు సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో రాష్ట్రం పూర్తిగా ఆగమైందని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలకు దోచుకోవడం తప్ప అభివృద్ధి పట్టడం లేదని ఆరోపించారు.

సాగునీరు మాత్రమే కాదు, తాగునీరు కూడా సక్రమంగా అందించలేకపోతున్నారని, ఇచ్చిన హామల సంగతి దేవుడెరుగు, కేసీఆర్ ఇచ్చిన హామీలను కూడా కొనసాగించలేకపోతున్నారని ప్రజలు అంటున్నారని గుర్తు చేశారు.పెన్షన్లు పెంచుతామని చెప్పి ఇప్పటివరకు ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించారు.

అలాగే, ఆడబిడ్డల పెండ్లిళ్లకు కేసీఆర్ అందించిన లక్ష రూపాయల సహాయం, తులం బంగారం ఎప్పుడిస్తారని ప్రశ్నిస్తూ,మహిళలు,విద్యార్థులు,నిరుద్యోగులు, పేదలకు ఇచ్చిన హామీలు ఎటుపోయాయని నిలదీశారు. ఇప్పుడు జరగబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ నాయకులు ఏ మొఖం పెట్టుకుని ఓట్లు అడుగుతారని ప్రశ్నించారు.కాంగ్రెస్ నాయకులు ఇండ్ల ముందుకు వస్తే ప్రజలే నిలదీయాలని పిలుపునిచ్చారు. రెండేళ్లు ఓపిక పట్టితే మళ్లీ కేసీఆర్ ప్రభుత్వమే వస్తుందని ఎవ్వరూ అధైర్యపడవద్దని, ఐక్యతతో విజయాలు సాధించుకుందామని ఆయన పిలుపునిచ్చారు.

Sthanikam

హామీలు అమలు చేయడంలో కాంగ్రెస్ విఫలం

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News