Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డివైఎఫ్ఐ రాష్ట్ర మహాసభలకు సన్నద్ధం కావాలి ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 04:00 PM

హామీ నిలబెట్టుకున్న సింగీతం సర్పంచ్ – ఆడబిడ్డలకు 5,116 రూపాయల సహాయం

20-02-2026 74 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

ఆందోల్ నియోజకవర్గంలో రాయికోడ్ మండల పరిధిలోని సింగీతం గ్రామ ఆడబిడ్డల పెళ్లిళ్లకు అండగా నిలవాలనే సంకల్పంతో సర్పంచ్ కనుకగా ఆడపడుచులకు 5,116 రూపాయల నగదు అందించే నూతన కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. గ్రామ పంచాయతీ ఎన్నికల సమయంలో గ్రామ ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు, సింగీతం ఆడబిడ్డల వివాహాలకు తమ వంతు సహాయం అందిస్తామని చెప్పిన మాటను సర్పంచ్ శ్రావణి నిరంజన్ నిలబెట్టుకుంటున్నారు.ఈ కార్యక్రమంలో భాగంగా పెద్దగొల్ల అనుషమ్మ – బాబు కుమార్తె శ్రీలత వివాహ మహోత్సవానికి హాజరై మొదటి కానుకగా 5,116 రూపాయలను అందజేశారు. మన గ్రామ ఆడబిడ్డలు ఆనందంగా ఉండాలని, వారి తల్లిదండ్రులకు వివాహ సమయంలో కొంత ఆర్థిక భరోసా కలగాలని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. నూతన వధూవరులు సుఖసంతోషాలతో, ఐశ్వర్య సంపదలతో దీర్ఘాయుష్షుతో జీవించాలని ఆకాంక్షించారు.గ్రామ అభివృద్ధి మాత్రమే కాకుండా, సామాజిక బాధ్యతలో భాగంగా ఇలాంటి సేవా కార్యక్రమాలు నిరంతరం కొనసాగుతాయని చెప్పారు. గ్రామంలోని ప్రతి ఆడపడుచుకు అవసరమైనప్పుడు గ్రామ పంచాయతీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ మహేష్, కే శామయ్య, శివయ్య, అంజయ్య, శ్రీశైలం, భరత్, కే నిరంజన్, హరికృష్ణ, సుధాకర్, మనోజ్, పీజీ శ్రీకాంత్, పీజీ శ్రీశైలం, కే ఉదయ్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

హామీ నిలబెట్టుకున్న సింగీతం సర్పంచ్ – ఆడబిడ్డలకు 5,116 రూపాయల సహాయం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News