Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 01:12 PM

హైదరాబాదులో గుండెపోటుతో నేరడ పంచాయతీ కార్యదర్శి మృతి

14-02-2026 136 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

చిట్యాల మండలం నేరడ గ్రామ పంచాయతీ కార్యదర్శి మేకల వెంకటేశ్వరరావు (61) ఇవాళ ఉదయం గుండెపోటుతో ఆకస్మికంగా కన్నుమూశారు. ఈ ఘటన హైద

అధికారుల సమాచారం మేరకు, వ్యక్తిగత పనిమీద హైదరాబాద్‌కు వచ్చిన వెంకటేశ్వరరావు ఇమ్లిబన్ బస్టాండ్‌లో అస్వస్థతకు గురయ్యారు. అక్కడే కుప్పకూలడంతో సమీప ఆసుపత్రికి తరలించగా, వైద్యులు ఆయనను మృతిగా నిర్ధారించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.

మేకల వెంకటేశ్వరరావు గతంలో ఇదే మండలంలోని ఏపూరు గ్రామ పంచాయతీలో విధులు నిర్వహించారు. ప్రస్తుతం నేరడ పంచాయతీలో కార్యదర్శిగా సేవలందిస్తూ, విధుల్లో నిబద్ధతతో పనిచేసేవారిగా సహచరుల ప్రశంసలు పొందారు. ఈ ఏడాది సెప్టెంబర్‌లో పదవీ విరమణ చేయాల్సి ఉన్నట్లు సమాచారం.

ఆయన మృతి పట్ల మండల పరిషత్ కార్యాలయ సిబ్బంది, పంచాయతీ కార్యదర్శులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. “సేవాభావంతో పనిచేసే నిబద్ధత గల అధికారి కోల్పోవడం బాధాకరం” అంటూ సానుభూతి తెలిపారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం ప్రకటించారు.

మృతదేహాన్ని పోస్ట్‌మార్టం అనంతరం స్వగ్రామానికి తరలించే ఏర్పాట్లు జరుగుతున్నట్లు తెలిసింది. వెంకటేశ్వరరావు మృతితో మండలంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

Sthanikam

హైదరాబాదులో గుండెపోటుతో నేరడ పంచాయతీ కార్యదర్శి మృతి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News