Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చిన్న కోతలతోనే ఛాతీ శస్త్రచికిత్సలు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 11:36 AM

హైదరాబాద్ వెళ్లే వాహనాలకు ప్రత్యామ్నాయ మార్గాలు ఎస్పి శరత్ చంద్ర పవర్ ఐపీఎస్

16-01-2026 271 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

నల్గొండ స్థానికం ప్రతినిధి కొమిడాల మహేందర్ రెడ్డి

సంక్రాంతి పండగ ముగిసిన అనంతరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి హైదరాబాద్ నగరానికి ఒకేసారి భారీగా వాహనాలు చేరుకునే అవకాశాలు ఉన్న నేపథ్యంలో, ట్రాఫిక్ రద్దీ నివారణకు జిల్లా పోలీస్ శాఖ ప్రత్యేక దారి మళ్లింపు చర్యలు చేపట్టినట్లు జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఐపీఎస్ తెలిపారు.

హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారి (ఎన్‌హెచ్-65) పై చిట్యాల, పెద్దకాపర్తి ప్రాంతాల్లో ఫ్లైఓవర్ నిర్మాణ పనులు కొనసాగుతున్న కారణంగా వాహనాల రద్దీ ఏర్పడే ప్రమాదం ఉందన్నారు. ఈ పరిస్థితుల్లో ప్రధాన రహదారిపై ట్రాఫిక్ జామ్ కాకుండా, ప్రయాణికులకు సురక్షితమైన మరియు సాఫీ ప్రయాణం కల్పించడమే లక్ష్యంగా దారి మళ్లింపులు అమలు చేస్తున్నట్లు తెలిపారు.

హైదరాబాద్ వెళ్లే వాహనాలకు ప్రత్యామ్నాయ మార్గాలు

1. గుంటూరు నుంచి హైదరాబాద్ వెళ్లే వాహనాలు:

గుంటూరు → మిర్యాలగూడ → హాలియా → కొండమల్లేపల్లి → చింతపల్లి → మాల్ మీదుగా హైదరాబాద్.

2. మాచర్ల నుంచి హైదరాబాద్ వెళ్లే వాహనాలు:

మాచర్ల → నాగార్జునసాగర్ → పెద్దవూర → కొండమల్లేపల్లి → చింతపల్లి → మాల్ మీదుగా హైదరాబాద్.

3. నల్లగొండ నుంచి హైదరాబాద్ వెళ్లే వాహనాలు:

నల్లగొండ → మార్రిగూడ బైపాస్ → మునుగోడు → నారాయణపూర్ → చౌటుప్పల్ (ఎన్‌హెచ్-65) మీదుగా హైదరాబాద్.

4. విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్లే భారీ వాహనాలు:

కోదాడ → హుజూర్నగర్ → మిర్యాలగూడ → హాలియా → చింతపల్లి → మాల్ మీదుగా హైదరాబాద్.

5. ఎన్‌హెచ్-65పై ట్రాఫిక్ జామ్ ఏర్పడిన పక్షంలో:

చిట్యాల నుంచి భువనగిరి మీదుగా హైదరాబాద్‌కు వాహనాలను మళ్లించనున్నట్లు పోలీసులు తెలిపారు.

ఈ ప్రత్యామ్నాయ మార్గాల వినియోగంతో విజయవాడ–హైదరాబాద్ జాతీయ రహదారిపై ట్రాఫిక్ ఒత్తిడి గణనీయంగా తగ్గి, ప్రయాణికులు తమ గమ్యస్థానాలకు త్వరగా చేరుకునే అవకాశం ఉంటుందని జిల్లా పోలీస్ అధికారులు స్పష్టం చేశారు.

జిల్లా ఎస్పీ సందేశం

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ మాట్లాడుతూ,

“సంక్రాంతి పండగ అనంతరం హైదరాబాద్‌కు వెళ్లే ప్రజలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సురక్షితంగా తమ గమ్యస్థానాలకు చేరుకోవాలన్నదే పోలీస్ శాఖ ప్రధాన లక్ష్యం. ట్రాఫిక్ రద్దీ వల్ల అసౌకర్యాలు తలెత్తకుండా ముందస్తు ప్రణాళికతో దారి మళ్లింపు చర్యలు అమలు చేస్తున్నాం. ప్రయాణికులు పోలీస్ శాఖ సూచించిన మార్గాలను అనుసరించి, ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ ఓర్పుతో ప్రయాణించాలి” అని కోరారు.

పండగ రోజులలో కీలక కూడళ్ల వద్ద ట్రాఫిక్ పోలీసులు విధులు నిర్వహిస్తూ, డ్రోన్ కెమెరాలు, సీసీటీవీ నిఘాతో ట్రాఫిక్ పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో డయల్ 100 ను సంప్రదించాలని జిల్లా ఎస్పీ విజ్ఞప్తి చేశారు.

Sthanikam

హైదరాబాద్ వెళ్లే వాహనాలకు ప్రత్యామ్నాయ మార్గాలు ఎస్పి శరత్ చంద్ర పవర్ ఐపీఎస్

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News