Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 06:19 AM

హై-రిస్క్ గర్భిణీ ట్రాకింగ్‌పై ఏఎన్‌ఎంలకు ప్రత్యేక శిక్షణ

19-02-2026 24 Views
Reporter
స్థానికం ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter

-ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే ప్రసవాలు జరిగేలా చర్యలు: జిల్లా కలెక్టర్ హనుమంత రావు

National Health Mission తెలంగాణ రాష్ట్ర ఆదేశాల మేరకు యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో అర్మాన్ ట్రైనింగ్ బృందం,హైదరాబాద్ ఆధ్వర్యంలో ఏఎన్‌ఎంలకు (ANMs) హై-రిస్క్ గర్భిణీ ట్రాకింగ్ మరియు నిర్వహణపై ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ శ్రీ హనుమంత రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో నార్మల్ డెలివరీలు పెరిగేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఏఎన్‌ఎంలకు సూచించారు. ప్రతి గర్భిణి స్త్రీని గర్భధారణ మొదటి నెల నుంచే నమోదు చేసి,ఆమె ఆరోగ్య పరిస్థితిపై పూర్తి అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. హై-రిస్క్ గర్భిణీ కేసులను ముందుగానే గుర్తించి, క్రమం తప్పకుండా ట్రాక్ చేస్తూ ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే మెరుగైన వైద్యం అందేలా చూడాలని ఆదేశించారు.

గ్రామీణ ప్రాంతాల్లో పల్లె దవాఖానల్లో సిబ్బంది కొరత కారణంగా కొంతమంది గర్భిణీలు ప్రభుత్వ ఆసుపత్రులకు రాకుండా ప్రైవేట్ ఆసుపత్రులకు వెళుతున్నారని తెలిపారు. అక్కడ అవసరం లేకపోయినా భయపెట్టి సిజేరియన్ ఆపరేషన్లు చేస్తున్న సందర్భాలు ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అనవసర సిజేరియన్ ఆపరేషన్లను అరికట్టాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో నాణ్యమైన వైద్యం అందుబాటులో ఉందని,వైద్యులు నార్మల్ డెలివరీలు జరిగేలా కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. జిల్లాలోని అన్ని గర్భిణీలు ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే ప్రసవాలు జరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖాధికారి డా. ఎం. మనోహర్ మాట్లాడుతూ, అన్ని MPHA (F)లకు హై-రిస్క్ గర్భిణీ ప్రోటోకాల్స్ ప్రాముఖ్యతను వివరించారు. హై–రిస్క్ కేసులను తొందరగా గుర్తించడం ద్వారా సమయానుకూలంగా మెరుగైన చికిత్స అందించవచ్చని తెలిపారు. అవసరమైన సందర్భాల్లో సమయానికి రిఫరల్ చేయడంపై కూడా అవగాహన కల్పించారు. ప్రతి గర్భిణి ప్రభుత్వ ఆసుపత్రిలోనే డెలివరీ అయ్యే విధంగా కృషి చేయాలని సూచించారు. అర్మాన్ ట్రైనింగ్ బృందానికి చెందిన డా.భవాని మరియు డా.రోహిణి హై-రిస్క్ గర్భిణీ ప్రోటోకాల్స్‌పై సవివరంగా శిక్షణ అందించారు.ఈ కార్యక్రమంలో డా. యశోద (ప్రోగ్రాం అధికారి–MHN),డా.రామకృష్ణ (ప్రోగ్రాం అధికారి-CH&I),డా.వీణ (ప్రోగ్రాం అధికారి-NCD),డా.వంశీ కృష్ణ (ప్రోగ్రాం అధికారి-NTEP) తదితర వైద్య ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు.

Sthanikam

హై-రిస్క్ గర్భిణీ ట్రాకింగ్‌పై ఏఎన్‌ఎంలకు ప్రత్యేక శిక్షణ

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News