Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండలో మెడ్‌ప్లస్ మెడికల్ షాపు ప్రారంభం. ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటు ధరల్లో అందిస్తాం: నిర్వాహకులు నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 06:10 AM

హామీలకు కార్యరూపం… ప్రభుత్వ పాఠశాల అభివృద్ధికి శంకుస్థాపన చేసిన సర్పంచ్ సాయికుమార్ గౌడ్

హామీలకు కార్యరూపం… ప్రభుత్వ పాఠశాల అభివృద్ధికి శంకుస్థాపన చేసిన సర్పంచ్ సాయికుమార్ గౌడ్

హామీలకు కార్యరూపం… ప్రభుత్వ పాఠశాల అభివృద్ధికి శంకుస్థాపన చేసిన సర్పంచ్ సాయికుమార్ గౌడ్
January 02, 2026 12:25 PM 314 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ఇచ్చిన హామీలకు కార్యరూపం… బోగారం గ్రామంలో అభివృద్ధి బాటలో సర్పంచ్

రామన్నపేట – స్థానిక ప్రతినిధి

ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ, గ్రామాభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగుతున్న సర్పంచ్‌గా కునూరు సాయికుమార్ గౌడ్ మరోసారి తన ప్రత్యేకతను చాటుకున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం బోగారం గ్రామంలో ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ, ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలో స్టేజీ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “మన ఊరు – మన బడి” అన్న భావన ప్రతి గ్రామస్తుడిలో ఉండాలని, ప్రభుత్వ పాఠశాలలను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిదేనని స్పష్టం చేశారు. నేటి బాలలే రేపటి పౌరులు అనే నినాదంతో పాఠశాల సమగ్ర అభివృద్ధికి అన్ని విధాల సహకరిస్తానని హామీ ఇచ్చారు. భవిష్యత్తులో పాఠశాల ప్రాంగణంలో మహనీయుల విగ్రహాల ఏర్పాటు ద్వారా విద్యార్థుల్లో దేశభక్తి, విలువలు పెంపొందించే దిశగా చర్యలు తీసుకుంటామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ముస్కు వెంకట్ రెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ బద్దుల ఉమా రమేష్ యాదవ్, ఉప సర్పంచ్ బైకాని ఉమా మహేష్, వార్డు సభ్యులు గోగు ప్రమీల రమేష్, మేడి ఆంజనేయులు దేవి, నేరటి మానస సురేష్, కడారి పావని పాపయ్య, గోగు సురేష్, వనం అండాలు యాదగిరి పాల్గొన్నారు. అలాగే పాఠశాల ఎస్‌ఎంసీ చైర్మన్ అంతటి ధనమ్మ మల్లేశం,, పంచాయతీ కార్యదర్శి అయ్యప్ప రెడ్డి, గ్రామ పెద్దలు, యువత పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News