Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జన్మదిన వేడుకలు రద్దు.. మృతుడి కుటుంబానికి రూ.8 లక్షల సాయం అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 08:23 AM

హామీలే ఎక్కువ… అభివృద్ధి శూన్యం.మాజీ ఎమ్మెల్యే లింగయ్య

04-01-2026 107 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

చిట్యాలలో కాంగ్రెస్ వైఫల్యాలపై బాకీ కార్డుల పంపిణీ

చిట్యాల స్థానిక ప్రతినిధి

చిట్యాల మున్సిపాలిటీలోని 8వ వార్డు చంద్రపురి కాలనీలో అధికార కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలను ప్రజలకు వివరించేందుకు నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య బాకీ కార్డుల కార్యక్రమం నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ప్రజలకు చెల్లించాల్సిన హామీల బాకీని కార్డుల రూపంలో వివరించుతూ ఆయన వార్డులలో పర్యటించారు.ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ప్రజలను మోసం చేసిన తీరును వివరించారు. బిఆర్ఎస్ హయాంలో అమలైన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు గుర్తు చేస్తూ, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఎలా గాలిలో కలిసిపోయాయో వివరించారు.అనంతరం మీడియాతో మాట్లాడిన చిరుమర్తి లింగయ్య మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అమలుకాని హామీలతో అధికారంలోకి వచ్చిందని, గద్దెనెక్కిన నాటి నుంచి అదే మోసపూరిత పంథాను కొనసాగిస్తోందని విమర్శించారు. అభివృద్ధి విషయంలో కాంగ్రెస్ పాలన పూర్తిగా శూన్యమని అన్నారు.కాంగ్రెస్ మోసాలను ఎండగట్టడానికే చిట్యాల మున్సిపాలిటీలో పర్యటించామని స్పష్టం చేశారు. బిఆర్ఎస్ హయాంలో చిట్యాల మున్సిపాలిటీకోసం కోట్ల రూపాయల నిధులు తీసుకొచ్చామని గుర్తు చేశారు. తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో దాదాపు 30 కోట్ల రూపాయలతో పట్టణంలో అనేక సిసి రోడ్లు, డ్రైనేజీలు, ఇంటిగ్రేటెడ్ వెజ్ & నాన్ వెజ్ మార్కెట్, వైకుంఠదామాలు, కుల సంఘ భవనాలు వంటి అభివృద్ధి పనులను పూర్తి చేశామని తెలిపారు.ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రెండేళ్లుగా పట్టణంలో ఒక్కరోజు కూడా పర్యటించిన దాఖలాలు లేవని, పట్టణ సమస్యలపై స్పందించిన సందర్భమే లేదని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రమే హడావుడి చేస్తుందని, ఎన్నికలు లేకపోతే ప్రజలను పూర్తిగా విస్మరిస్తుందని విమర్శించారు.రేవంత్ రెడ్డి పాలనలో పార్టీ నాయకులు సంచులు మోయడానికే పరిమితమయ్యారని ఎద్దేవా చేశారు. ఎన్నికల సమయంలో మాత్రమే ప్రజల వద్దకు వచ్చి మాయమాటలు చెబుతారని అన్నారు.

కెసిఆర్ హయాంలో జరిగిన అభివృద్ధిని, రేవంత్ రెడ్డి పాలనలో జరిగిన పనులను ప్రజలు బేరీజు వేసుకోవాలని కోరారు. వచ్చే ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపిస్తేనే మున్సిపాలిటీ ప్రజలకు నిజమైన లాభం జరుగుతుందని చెప్పారు. ప్రజలు ఆలోచించి ఓటు వేసి బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని ఆయన పిలుపునిచ్చారు.

Sthanikam

హామీలే ఎక్కువ… అభివృద్ధి శూన్యం.మాజీ ఎమ్మెల్యే లింగయ్య

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News