Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 04:13 PM

గుర్తుతెలియని కారు ఢీకొని కూలీ మృతి

గుర్తుతెలియని కారు ఢీకొని కూలీ మృతి

గుర్తుతెలియని కారు ఢీకొని కూలీ మృతి
10-03-2026 110 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

తూప్రాన్‌పేట్ వద్ద రోడ్డు ప్రమాదం… చికిత్స పొందుతూ యువకుడు మృతి

రోడ్డు దాటుతున్న యువకుడిని గుర్తుతెలియని కారు ఢీకొనడంతో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటన తూప్రాన్‌పేట్ గ్రామ పరిధిలో చోటుచేసుకుంది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… బీహార్ రాష్ట్రానికి చెందిన శంకర్ సహ్ని (25) తూప్రాన్‌పేట్ గ్రామంలోని సాయి వికాస్ క్యాస్టింగ్ కంపెనీలో కూలీగా పని చేస్తున్నాడు. ఆదివారం రాత్రి సమయంలో సరుకులు కొనుగోలు చేసేందుకు తూప్రాన్‌పేట్ గ్రామంలోని చాచా దాబా పక్కన ఉన్న కిరాణా దుకాణానికి వెళ్లాడు.సరుకులు తీసుకుని తిరిగి రోడ్డు దాటుతున్న సమయంలో విజయవాడ నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న గుర్తుతెలియని కారు డ్రైవర్ అతివేగంగా, అజాగ్రత్తగా వాహనం నడుపుతూ వచ్చి ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో శంకర్ సహ్నికి కుడి కాలు తొడ భాగంలో, ముఖంపై తీవ్ర రక్తగాయాలు అయ్యాయి.

స్థానికులు వెంటనే 108 అంబులెన్స్ ద్వారా హయత్‌నగర్‌లోని సన్‌రైజ్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ రాత్రి శంకర్ సహ్ని మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. కేసు నమోదు చేసి సిఐ జి. మన్మధ కుమార్ దర్యాప్తు ప్రారంభించారు.

Sthanikam

గుర్తుతెలియని కారు ఢీకొని కూలీ మృతి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News