Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఉద్యోగుల డిమాండ్లపై మహాధర్నా అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 28, 2026 10:33 AM

గుర్రంపోడు తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడులు

02-02-2026 66 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

రూ.20 వేల లంచం తీసుకుంటూ రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ అరెస్ట్

నల్లగొండ జిల్లా గుర్రంపోడు మండల తహశీల్దార్ కార్యాలయంలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు సోమవారం మధ్యాహ్నం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా గుర్రంపోడు మండల రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ మహమ్మద్ అబ్దుల్ హకీమ్‌ను రూ.20 వేల లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

ఫిర్యాదుదారునికి సంబంధించిన సర్వే నెం.225/6లోని 1.15 ఎకరాల భూమి వివరాలు ఆన్‌లైన్ 1-బి (ROR) రిజిస్టర్ నుండి తొలగించబడటంతో, వాటిని పునరుద్ధరించేందుకు దరఖాస్తు స్వీకరించి సంబంధిత ఫైల్‌ను తహశీల్దార్‌కు ప్రాసెస్ చేసి పంపేందుకు రూ.20,000 లంచం డిమాండ్ చేసినట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. లంచం స్వీకరిస్తున్న సమయంలో ఏసీబీ అధికారులు నిందితుడిని పట్టుకున్నారు.

నిందిత అధికారి సూచన మేరకు లంచంగా తీసుకున్న నగదును స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. ప్రభుత్వ విధిని నిజాయితీగా నిర్వహించక అక్రమ లాభం పొందేందుకు ప్రయత్నించినందుకు మహమ్మద్ అబ్దుల్ హకీమ్‌ను అరెస్ట్ చేసి, హైదరాబాద్‌లోని ఏసీబీ విచారణ కోర్టు మొదటి అదనపు ప్రత్యేక న్యాయమూర్తి ఎదుట హాజరుపరచనున్నట్లు అధికారులు తెలిపారు.

కేసు దర్యాప్తు కొనసాగుతున్న నేపథ్యంలో భద్రతా కారణాల దృష్ట్యా ఫిర్యాదుదారుని వివరాలను గోప్యంగా ఉంచినట్లు స్పష్టం చేశారు.

ప్రభుత్వ ఉద్యోగులు లంచం డిమాండ్ చేసినట్లయితే వెంటనే ఏసీబీ టోల్ ఫ్రీ నెంబర్ 1064కు సమాచారం ఇవ్వాలని అధికారులు ప్రజలను కోరారు. వాట్సాప్ (9440446106), ఫేస్‌బుక్ (Telangana ACB), ఎక్స్/ట్విట్టర్ (@Telangana ACB) ద్వారా కూడా సంప్రదించవచ్చని తెలిపారు.

ప్రభుత్వ కార్యాలయాలు, ప్రముఖ బహిరంగ ప్రదేశాల్లో ఏసీబీ సంప్రదింపుల కోసం క్యూఆర్ కోడ్‌లు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. అవినీతిని నిర్మూలించాలంటే ప్రజల భాగస్వామ్యం అత్యవసరమని ఏసీబీ అధికారులు విజ్ఞప్తి చేశారు.

Sthanikam

గుర్రంపోడు తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడులు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News