Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
18 కాలనీల డంపింగ్‌ యార్డ్‌ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలి. టీపీసీసీ ప్రధాన కార్యదర్శి పృథ్వీ చౌదరి. దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 08:25 AM

గుంజ రేణుక నారాయణ నియామకం పై సీఎం రేవంత్‌రెడ్డికి వడ్డెర సంఘం కృతజ్ఞతలు

13-05-2026 47 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట: వడ్డెర కార్పొరేషన్‌ చైర్మన్‌గా గుంజ రేణుక నారాయణను నియమించడం వడ్డెర కులానికి గౌరవప్రదమైన విషయమని వడ్డెర సంఘం నాయకులు పేర్కొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండల కేంద్రంలో నిర్వహించిన కార్యక్రమంలో మండల అధ్యక్షుడు దండ్ల సమ్మయ్య మాట్లాడారు.

గత కొన్ని సంవత్సరాలుగా వడ్డెర కుల అభివృద్ధికి, ఎస్టీ సాధన కోసం గుంజ రేణుక నారాయణ నిరంతరం పోరాటం చేస్తున్నారని, అలాంటి నాయకుడికి కార్పొరేషన్‌ చైర్మన్‌ పదవి ఇవ్వడం అభినందనీయమన్నారు.

ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, నకిరేకల్‌ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ వేముల వీరేశం, రాష్ట్ర అధ్యక్షుడు మంజుల రమేష్‌లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో యాదాద్రి భువనగిరి జిల్లా వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ పల్లపు దుర్గయ్య, పట్టణ అధ్యక్షుడు పల్లపు రవి, దండ రాములు, గొలుసుల ప్రసాద్‌, శివరాత్రి సమ్మయ్య, శివరాత్రి యాదగిరి, పల్లపు అంజయ్య, శివరాత్రి కిష్టయ్య తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

గుంజ రేణుక నారాయణ నియామకం పై సీఎం రేవంత్‌రెడ్డికి వడ్డెర సంఘం కృతజ్ఞతలు

Article Image

రామన్నపేట: వడ్డెర కార్పొరేషన్‌ చైర్మన్‌గా గుంజ రేణుక నారాయణను నియమించడం వడ్డెర కులానికి గౌరవప్రదమైన విషయమని వడ్డెర సంఘం నాయకులు పేర్కొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండల కేంద్రంలో నిర్వహించిన కార్యక్రమంలో మండల అధ్యక్షుడు దండ్ల సమ్మయ్య మాట్లాడారు.

గత కొన్ని సంవత్సరాలుగా వడ్డెర కుల అభివృద్ధికి, ఎస్టీ సాధన కోసం గుంజ రేణుక నారాయణ నిరంతరం పోరాటం చేస్తున్నారని, అలాంటి నాయకుడికి కార్పొరేషన్‌ చైర్మన్‌ పదవి ఇవ్వడం అభినందనీయమన్నారు.

ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, నకిరేకల్‌ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ వేముల వీరేశం, రాష్ట్ర అధ్యక్షుడు మంజుల రమేష్‌లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో యాదాద్రి భువనగిరి జిల్లా వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ పల్లపు దుర్గయ్య, పట్టణ అధ్యక్షుడు పల్లపు రవి, దండ రాములు, గొలుసుల ప్రసాద్‌, శివరాత్రి సమ్మయ్య, శివరాత్రి యాదగిరి, పల్లపు అంజయ్య, శివరాత్రి కిష్టయ్య తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News