Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 12:36 PM

గుడిపల్లిలో కూలీల నిరసన – ఫేస్ యాప్ ఫోటోలపై వ్యతిరేకత

09-04-2026 77 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Penukonda
EDIGA NAVEENKUMAR

శ్రీ సత్యసాయి జిల్లా సోమందేపల్లి మండలం గుడిపల్లి గ్రామంలో వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో కూలీలు పని ప్రదేశంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఇటీవల పని సమయంలో కూలీలకు ఫేస్ యాప్ ద్వారా ఫోటోలు తీసే విధానాన్ని అమలు చేయడం పట్ల వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విధానం కూలీల గౌరవాన్ని దెబ్బతీస్తుందని, వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు.

అదేవిధంగా మేట్లకు ఉచితంగా సెల్ ఫోన్లు అందించాలని, కూలీలకు అవసరమైన పని ముట్లు (పరికరాలు) సరఫరా చేయాలని కోరారు. కూలీల సమస్యలను పరిష్కరించకపోతే మరింత ఉధృతంగా ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా కమిటీ సభ్యుడు పెద్దన్న, మేట్లు శ్రీనివాస్, చంద్రకళ, రంగనాథ్, వెంకట రమణమ్మ, గంగరత్నమ్మ, గాయిత్రి, ఎస్. శ్రీనివాస్, అచ్యుత, కలావతి పాల్గొన్నారు. అలాగే కూలీలు రామాంజనేయులు, రంగనాథ్, రామప్ప, చంద్ర తదితరులు పాల్గొని తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువచ్చారు.

Sthanikam

గుడిపల్లిలో కూలీల నిరసన – ఫేస్ యాప్ ఫోటోలపై వ్యతిరేకత

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News