Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 11:43 PM

గుండెపోటుతో ఎన్‌జి కళాశాల అధ్యాపకుడి మృతి

23-03-2026 55 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

నాగార్జున ప్రభుత్వ కళాశాల తెలుగు విభాగంలో అతిథి అధ్యాపకునిగా పనిచేస్తున్న గొడుగు గోవర్ధనగిరి సోమవారం గుండెపోటుతో మృతి చెందినట్లు కళాశాల ప్రిన్సిపాల్‌ డా. సముద్రాల ఉపేందర్ తెలిపారు.

గత సోమవారం ఉదయం గుండెపోటు రావడంతో ఆయనను హుటాహుటిన హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ అపోలో ఆసుపత్రికి తరలించగా, అక్కడ శస్త్రచికిత్స నిర్వహించినప్పటికీ మళ్లీ గుండెపోటు రావడంతో తుదిశ్వాస విడిచినట్లు తెలిపారు.

జిల్లాలోని అడవిదేవులపల్లి గ్రామానికి చెందిన గోవర్ధనగిరి గత ఎనిమిదేళ్లుగా ఎన్‌జి కళాశాల తెలుగు విభాగంలో అతిథి అధ్యాపకునిగా సేవలు అందిస్తున్నారు. విద్యార్థులకు మార్గదర్శకుడిగా నిలిచిన ఆయన మృతి కళాశాలకు తీరని లోటని ప్రిన్సిపాల్ పేర్కొన్నారు.

మృతుడికి భార్య అలివేలు, కుమారుడు యశ్వంత్, కుమార్తె ఉన్నారు.

గోవర్ధనగిరి మృతి పట్ల వైస్ ప్రిన్సిపాల్ డా. రవికుమార్, పరీక్షల నియంత్రణాధికారి డా. డి. మునిస్వామి, తెలుగు విభాగం అధ్యక్షుడు డా. వెల్దండి శ్రీధర్‌తో పాటు అధ్యాపకులు, సిబ్బంది కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

Sthanikam

గుండెపోటుతో ఎన్‌జి కళాశాల అధ్యాపకుడి మృతి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News