Sthanikam - Truth Matters
Logo
Sthanikam
PRINT TIME: February 24, 2026 12:38 AM

గ్రామీణ క్రీడాకారులు జాతీయ స్థాయికి వెళ్ళాలి...

గ్రామీణ క్రీడాకారులు జాతీయ స్థాయికి వెళ్ళాలి...

గ్రామీణ క్రీడాకారులు జాతీయ స్థాయికి వెళ్ళాలి...
January 17, 2026 09:36 AM 40 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sangareddy & Manoor
Sthanikam District Staff Reporter krishna

యువజన కాంగ్రేస్‌ మండల అద్యక్షుడు ప్రవీణ్‌ముదిరాజ్‌

- క్రికెట్, వాలీబాల్‌ పోటీల విజేతలుగా నిలిచిన శ్రీకాంత్, దత్తు టీంలు

- అలంరించిన కబడ్డీ జూనియర్‌ పోటీలు...విజేతగా నిలిచిన ప్రవీణ్‌ టీం

- కీ.శే బి.సాయికుమార్‌ జ్ఞాపకార్థం విజేతలకు బహుమతల ప్రధానం

- అట్టహాసంగా ముగిసిన కేపిఎల్‌ సీజన్‌–3

సంగారెడ్డి జిల్లా స్థానికం ప్రతినిధి కృష్ణ:ఆందోల్ గ్రామీణ క్రీడాకారులు క్రీడల్లో రాణించి జాతీయ స్థాయి వరకు వెళ్లాలని తాను ఆకాంక్షిస్తున్నట్లు యువజన కాంగ్రేస్‌ మండల అద్యక్షుడు ప్రవీణ్‌ ముదిరాజ్, ఏయంసీ మాజీ డైరెక్టర్‌ శేరి వెంకట్‌రెడ్డి అన్నారు. గురువారం కన్‌సాన్‌పల్లి ప్రీమియర్‌ లీగ్‌ సీజన్‌–3 పోటీలలో భాగంగా చివరి రోజు వాలీబాల్‌ పోటీలు నిర్వహించారు. మొదటగా దేవునూరి శ్రీశైలం జట్టు, జోగాల శివకుమార్‌ జట్లు మద్య సాగిన హోరాహోరీగా పోరులో శివకుమార్‌ జట్టు విజయం సాధించింది. చివరి ఫైనల్‌ పోటీలో శివకుమార్‌ జట్టు, తలారీ దత్తు టీం జట్ల మద్య పోరు సరవత్తరంగా సాగడంతో అందరినీ ఆకర్షించింది.చివరగా తలారీ దత్తు టీం విజయం సాధించింది. ద్వితీయ స్థానంలో శివకుమార్‌ జట్టు నిలిచింది. అంతకు ముందు క్రికెట్‌ ఫైనల్‌ పోటీల్లో సంగాన్నగారి శ్రీకాంత్‌ (కన్‌సాన్‌పల్లి టైటాన్స్‌)జట్టు, తలారి బాలక్రిష్ణ (కన్‌సాన్‌పల్లి చాలెంజర్స్‌) జట్ల మద్య సాగిన పోరులో టైటాన్స్‌ జట్టు అద్భుతమైన పోలింగ్‌ ప్రదర్శించడంతో చాలెంజర్స్‌ జట్టు తక్కువ స్కోరుకే పరిమితం కావడం అటు తర్వాత టైటాన్స్‌ జట్టు సునాయస విజయాన్ని అందుకొని విజేతగా నిలిచింది. కేపిఎల్‌ సీజన్‌–3లో మొదటిసారిగా ప్రవేశపెట్టి జూనియర్స్‌ కబడ్డి పోటీలు అందరిని అలరించారు. మొదటి సారి జరుగుతున్న కబడ్డీ పోటీలను వీక్షించేందుకు గ్రామం నుండి పెద్ద ఎత్తున ప్రేక్షకులు తరలిరావడం రావడంతో ఒక్కసారిగా అక్కడి వాతావరణం క్రీడా సంబరంగా మారింది. మ్యాచ్‌లు జరుగుతున్న సమయంలో ప్రేక్షకుల నుండి మద్దతు పెరిగిపోవడంతో క్రీడాకారులు ఎంతో ఉత్సాహాన్ని ప్రదర్శిస్తూ క్రీడలు ఆడారు. చివరి పోటీలో పల్టాన్స్‌ మహేష్‌ టీం, నరహరి టైటాన్స్‌ టీం లు తలపడగా మహేష్‌ టీం పైచేయి సాధించి విజేతగా నిలిచింది. -విజేతలకు బహుమతల ప్రధానం...

ఈ సీజన్‌లో జరిగిన పోటీలకు సంబందించి కీ.శే బుసనెల్లి సాయికుమార్‌ జ్ఞాపకార్థంగా ఆయన సోదరుడు బుసనెల్లి అంజనేయులు బహుమతులను ప్రధానం చేశారు. గెలుపొందిన క్రీడాకారులకు స్థానిక జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో వేదికను ఏర్పాటు చేసి విజేతలకు బహుమతులను ప్రధానం చేశారు. ఈ కార్యక్రామానికి ముఖ్య అతిథిగా గ్రామ సర్పంచ్‌ సునీత మహిపాల్,యువజన కాంగ్రేస్‌ మండల అద్యక్షుడు ప్రవీణ్‌ ముదిరాజ్‌ హాజరై క్రీడాకారులకు బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్‌ పెంటయ్య, మాజీ ఎంపిటీసీ బాలయ్య, కాంగ్రేస్‌ సీనియర్‌ నాయకులు సురేష్‌రావు, వార్డు సభ్యులు మహిపాల్, వని మోహన్, తలారి బాలక్రిష్ణ, కలపల్లి లక్ష్మీప్రభు, రామాదేవి దుర్గేష్, యువ నాయకులు దేవునూరి శ్రీశైలం, జోగాల గోవర్ధన్, పంతులు ఈశ్వర్, రఘు, వహీద్, షర్ఫోద్దీన్, కాడెం శ్రీనివాస్,బాల్‌రాజ్, మణికంఠ, ముదిరాజ్‌ సంఘ అద్యక్షుడు ఈశ్వర్, మాజీ వార్డు సభ్యులు దత్తు, నాయకులు దుర్గయ్య, యాదయ్యతో పాటు తదితరులు పాల్గొన్నారు.కేపిఎల్ క్రీడలు విజయవంతం...*

కేపిఎల్‌ సీజన్‌–3 క్రీడలలో భాగంగా కబడ్డీ,వాలిబాల్, క్రికెట్‌ అను మూడు విభాగాలలో క్రీడలు నిర్వహించారు. మూడు రోజుల పాటు క్రీడలు సాగగా అందుకు మైదానాల ఏర్పాటు నుండి క్రీడాకారులకు సౌకర్యాల కల్పన వరకు ఎటువంటి ఇబ్బంతులు తలెత్తకుండా నిర్వహకులు బాలక్రిష్ణ, రాపర్తి ప్రభు, జోగాల ప్రవీణ్, క్రిష్ణలు చర్యలు తీసుకున్నారు.ఆటల్లో పాల్గొన్న 150 మంది క్రీడాకారులకు యువజన కాంగ్రేస్‌ అద్యక్షుడు జర్సీలు ఉచితంగా అందజేయగా, క్రీడాకారులకు అన్నధాన కార్యక్రమాన్ని పోలీసు దత్తు, యువ నాయకుడు పంతులు ఈశ్వర్‌ కూల్‌డ్రింక్స్‌తో పాటు క్రికెట్‌ బ్యాట్లు ,పి.భాగేష్‌ త్రాగునీటిని సరఫరా చేయగా,దేవునూరి ప్రభు ఆటగాళ్ల అందరికీ ఆరటి పళ్లను, వాలీబాల్‌ ఆట వస్తువులు వహీద్, అలసిపోయిన సందర్భంలో తక్షణ శిక్తని ఇచ్చేందుకు గ్లూకోండిని గొళ్ల కళ్యాణ్‌ , తాళ్ల మణికంఠ డిజే సౌండ్, టెంట్‌హౌజ్‌ ఏర్పాటుచేశారు. ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రధానమైన ఏర్పాట్లు చేయడంలో చేయూతను అందించి క్రీడలను విజయవంతం చేయడంలో కృషి చేయడం పట్ల వారిని అందరూ అభినందించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News