Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 05:28 AM

గోవిందాస్ క్యాంటీన్ ప్రారంభించిన మున్సిపల్ చైర్ పర్సన్ తంగళ్ళపల్లి శ్రీవాణి రవికుమార్

01-04-2026 28 Views
Reporter
స్థానికం ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter

భువనగిరిలో రూ.30కే భోజనం-గోవిందాస్ క్యాంటీన్

పేదల కోసం వినూత్నసేవ-దవా చాయ్‌తో గోవిందాస్ క్యాంటీన్

తక్కువ ధరకే పోషకాహారం-భువనగిరిలో ప్రజలకు వరంగా గోవిందాస్ క్యాంటీన్

భువనగిరి పట్టణంలో సామాన్య ప్రజలు, నిరుపేదలు మరియు పట్టణానికి నిత్యం వచ్చే ప్రయాణికులకు ఊరటనిచ్చేలా అతి తక్కువ ధరకే నాణ్యమైన భోజనం అందించేందుకు ‘గోవిందాస్ క్యాంటీన్’ ప్రారంభమైంది.స్థానిక బంజారాహిల్స్ సాధన హై స్కూల్ ప్రాంతంలో ఏర్పాటు చేసిన ఈ క్యాంటీన్‌ను భువనగిరి మున్సిపల్ చైర్ పర్సన్ తంగళ్ళపల్లి శ్రీవాణి రవికుమార్,31వ వార్డు కౌన్సిలర్ షఫీ అహ్మద్ బుధవారం ప్రారంభించారు.పెరుగుతున్న ధరల నేపథ్యంలో సామాన్యుడికి పౌష్టికాహారం అందించడం భారంగా మారుతున్న తరుణంలో,విద్యానగర్ ఇస్కాన్ టెంపుల్ ఇంచార్జ్ సిద్ధి స్వరూప్ దాస్ ప్రభు ఆధ్వర్యంలో కేవలం రూ.30కే కడుపునిండా భోజనం అందించాలనే సంకల్పంతో ఈ క్యాంటీన్‌ను ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ శ్రీవాణి రవికుమార్ మాట్లాడుతూ,గోవిందాస్ క్యాంటీన్లు దేశవ్యాప్తంగా సేవలు అందిస్తున్నాయని,భువనగిరిలో పేద ప్రజల ఆకలి తీర్చడమే ప్రధాన లక్ష్యమని తెలిపారు.తక్కువ ధర అయినప్పటికీ రుచి,నాణ్యత,శుభ్రత విషయంలో ఎలాంటి రాజీ ఉండదని స్పష్టం చేశారు. కేవలం భోజనమే కాకుండా,ఆరోగ్యానికి మేలు చేసే‘దవా చాయ్’(మూలికా టీ) అందించడం ఈ క్యాంటీన్ ప్రత్యేకతగా నిలిచింది.తక్కువ ఖర్చుతో ఆరోగ్యాన్ని కాపాడుకునేలా ఈ చాయ్‌ను రూపకల్పన చేసినట్లు నిర్వాహకులు తెలిపారు.హోటళ్లలో అధిక ఖర్చుతో కూడిన భోజనానికి ప్రత్యామ్నాయంగా,ఇంటి వంటను తలపించేలా పరిశుభ్రమైన వాతావరణంలో వంటలు సిద్ధం చేయనున్నట్లు చెప్పారు.క్యాంటీన్ ప్రారంభం పట్ల పట్టణ ప్రజలు,కూలీలు,మధ్యతరగతి ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.ప్రభుత్వ మరియు ప్రైవేటు సంస్థల సహకారంతో ఇలాంటి సేవా కార్యక్రమాలు మరిన్ని ఏర్పాటు కావాలని చైర్మన్ ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ వెంకట్ నాయక్,కాంగ్రెస్ సీనియర్ నాయకులు నక్కల ఆదినారాయణ,బాదం ప్రకాష్ గుప్త,కృష్ణ కాంత్,సాయి ప్రశాంత్,శ్రీనివాస్,రమేష్,వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

గోవిందాస్ క్యాంటీన్ ప్రారంభించిన మున్సిపల్ చైర్ పర్సన్ తంగళ్ళపల్లి శ్రీవాణి రవికుమార్

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News