Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గ్రాడ్యుయేట్ ఓటు నమోదు దరఖాస్తులు సమర్పించిన భరత్ బాబు ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 11:39 AM

గోవా అంతర్జాతీయ టాటుస్ కన్వెన్షన్‌లో హైదరాబాద్ నక్ష్ టాటుస్‌కు రెండో బహుమతి

27-01-2026 121 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Medchal Malkajgiri incharge
Prabhakar
స్థానికం ప్రతినిధి మల్కాజిగిరి పి.ప్రభాకర్

హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ టాటుస్ స్టూడియో నక్ష్ టాటుస్ గోవాలో నిర్వహించిన ప్రతిష్ఠాత్మక ఇండియన్ ఇంటర్నేషనల్ టాటుస్ కన్వెన్షన్లో రెండో స్థానాన్ని సాధించి నగరానికి గర్వకారణంగా నిలిచింది. అంతర్జాతీయ స్థాయి టాటుస్ కన్వెన్షన్‌కు ప్రపంచం నలుమూలల నుంచి టాటుస్ కళాకారులు, టాటుస్ అభిమానులు భారీ సంఖ్యలో హాజరయ్యారు. అనేక దేశాలకు చెందిన టాప్ టాటుస్ ఆర్టిస్టులు పూర్తి శరీర టాటుస్, పూర్తి కాలు స్లీవ్ డిజైన్‌లు, ఆకర్షణీయమైన టాటుస్‌ను ప్రదర్శించారు. ఈ కళాఖండాలు సందర్శకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.ఈ పోటీలో హైదరాబాద్ నుంచి నక్ష్ టాటుస్ స్టూడియోను ప్రతినిధిగా టాటుస్ ఆర్టిస్ట్ అనీష్ తమాంగ్ పాల్గొన్నారు. ఆయన రూపొందించిన అద్భుతమైన ట్రెడిషనల్ స్టైల్ టాటుస్ డిజైన్ కు జడ్జీల నుంచి మంచి ప్రశంసలు లభించాయి. ఫలితంగా నక్ష్ టాటుస్ రెండో బహుమతిని గెలుచుకుంది.ఈ సందర్భంగా స్టూడియో ఓనర్ పి.మధుసూదన్ రావు (విక్కీ) మాట్లాడుతూ,“ఇలాంటి అంతర్జాతీయ వేదికపై రెండో బహుమతి సాధించడం ఎంతో ఆనందంగా ఉంది. ప్రపంచ స్థాయి ఆర్టిస్టులతో పోటీ పడి ఈ గుర్తింపు రావడం మా టీమ్ కష్టానికి నిదర్శనం. సంప్రదాయ కళను ఆధునిక టాటుస్ రూపంలో నిలబెట్టడమే మా లక్ష్యం” అని తెలిపారు.నక్ష్ టాటుస్ టీమ్ మొత్తం ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొని హైదరాబాద్ టాటుస్ సంస్కృతిని అంతర్జాతీయ వేదికపై ప్రతిష్ఠాత్మకంగా ప్రదర్శించింది.పూర్తి శరీర టాటుస్‌లు, వినూత్న డిజైన్‌లు, కళాత్మక ప్రయోగాలతో ఈ గోవా టాటుస్ కన్వెన్షన్ అత్యంత వైభవంగా జరిగింది. ఇది గోవాలో నిర్వహించిన అతిపెద్ద టాటుస్ ఈవెంట్లలో ఒకటిగా నిలిచింది.ఈ విజయం ద్వారా హైదరాబాద్ నగరం అంతర్జాతీయ టాటుస్ రంగంలో వేగంగా ఎదుగుతున్న కేంద్రంగా మారుతోందని మరోసారి రుజువైంది. నక్ష్ టాటుస్ సాధించిన ఈ ఘనత నగర యువతకు, కళాకారులకు కొత్త ప్రేరణగా నిలుస్తోంది.

Sthanikam

గోవా అంతర్జాతీయ టాటుస్ కన్వెన్షన్‌లో హైదరాబాద్ నక్ష్ టాటుస్‌కు రెండో బహుమతి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News