Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గ్రాడ్యుయేట్ ఓటు నమోదు దరఖాస్తులు సమర్పించిన భరత్ బాబు ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 11:36 AM

గౌతమ్ నగర్ డివిజన్ నుంచి బరిలో ఉంటా : ఠాగూర్ అరుణ్ సిం

24-01-2026 45 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Medchal Malkajgiri incharge
Prabhakar

స్థానికం ప్రతినిధి మల్కాజ్గిరి పి ప్రభాకర్

రానున్న జిహెచ్ఎంసి కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీ చేయాలని తన అభిమానులు కోరుతున్నట్లు ప్రముఖ సంఘ సేవకులు ఠాగూర్ అరుణ్ సింగ్ తెలిపారు. జయగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయ చైర్మన్ గా తాను చేసిన సేవా కార్యక్రమాలతో గౌతం నగర్ డివిజన్ ప్రజల్లో తనకు మంచి గుర్తింపు వచ్చిందని అరుణ్ సింగ్ అన్నారు. గౌతమ్ నగర్ ప్రజలు, అభిమానులు కోరిక మేరకు కార్పొరేటర్ పోటీ చేస్తానని.. గెలిపిస్తే డివిజన్ అభివృద్ధికి కృషి చేస్తానని చెప్పారు. ఆలయ చైర్మన్ గా తాను చేసిన సేవా కార్యక్రమాల పట్ల సంతోషంగా ఉన్న గౌతమ్ నగర్ డివిజన్ ప్రజల ఆశీస్సులు తనకు పుష్కలంగా ఉన్నాయన్నారు. స్థానిక యువతతో పాటు అన్ని వర్గాల ప్రజల అండదండలు ఉన్నాయని పేర్కొన్నారు. గత కొన్ని సంవత్సరాలుగా గౌతమ్ నగర్ డివిజన్ లో సేవా కార్యక్రమాలతో పాటు ఆలయాల అభివృద్ధి, గణపతి నవరాత్రి ఉత్సవాలు, దుర్గామాత నవరాత్రి ఉత్సవాలు, పేద విద్యార్థులకు చదువు కోసం సహాయం, పేద మహిళల వివాహానికి తమ వంతు సహాయ సహకారాలు అందించానని గుర్తు చేశారు. గౌతమ్ నగర్ డివిజన్ లో రాజకీయాలకు, ప్రాంతాలకు అతీతంగా అందరికీ తలలో నాలుకలా వ్యవహరిస్తూ.. ఎన్నో కార్యక్రమాలు నిర్వహించానని పేర్కొన్నారు. గౌతమ్ నగర్ డివిజన్ లో ఉన్న ఎస్సీ, ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలతో పాటు సంపన్నుల అండదండలు తమకు ఉన్నాయని పేర్కొన్నారు. రానున్న జిహెచ్ఎంసి ఎన్నికలలో ఏ పార్టీ తమకు టికెట్ ఇచ్చినా గెలిచి తీరుతానని ధీమా వ్యక్తం చేశారు. రానున్న రోజులలో ప్రజల సంక్షేమం కోసం మరిన్ని సేవా కార్యక్రమాలతోతమ వంతు కృషి చేస్తానని తెలిపారు .

Sthanikam

గౌతమ్ నగర్ డివిజన్ నుంచి బరిలో ఉంటా : ఠాగూర్ అరుణ్ సిం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News