Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కాంగ్రెస్ నేతల అరెస్టు అప్రజాస్వామికం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 12:22 PM

గొట్టిపర్తి ప్రభుత్వ పాఠశాలలో పదవ తరగతి విద్యార్థులు ఘనంగా ఫేర్వెల్

11-03-2026 278 Views
Reporter
స్థానికం ప్రతినిధి : thungathurthi
Bandi Kiran Kumar

తుంగతుర్తి మండలం గొట్టిపర్తి గ్రామంలో జడ్‌పిహెచ్‌ఎస్ పాఠశాలలో పదవ తరగతి విద్యార్థులు బుధవారం ఘనంగా ఫేర్వెల్ కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీహరి మాట్లాడుతూ... పదవ తరగతి విద్యార్థులు జీవితంలో ఒక ముఖ్యమైన దశలోకి అడుగుపెడుతున్నారని అన్నారు. రాబోయే పబ్లిక్ పరీక్షలను ఎలాంటి భయం లేదా ఒత్తిడి లేకుండా ధైర్యంగా రాయాలని సూచించారు. సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ పాఠాలను పునరావృతం చేస్తే తప్పకుండా మంచి ఫలితాలు సాధించవచ్చని విద్యార్థులను ప్రోత్సహించారు. క్రమశిక్షణ, పట్టుదల, కష్టపడి చదివే అలవాటు ఉంటే భవిష్యత్తులో ఉన్నత స్థానాలు సాధించగలరని తెలిపారు.ఎలా చదవాలి, సమాధానాలను ఎలా రాయాలి అనే విషయాలపై విలువైన సూచనలు అందించారు. విద్యార్థులు తమ లక్ష్యాలను స్పష్టంగా నిర్ణయించుకుని కష్టపడి చదివితే జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవచ్చని అన్నారు. విద్యార్థులుపాఠశాలకు, గ్రామానికి తల్లిదండ్రులకు మంచి పేరు పాఖ్యాతులు తీసుకురావాలని కోరారు.అనంతరం అక్షర ఫౌండేషన్ ఆధ్వర్యంలో పదవ తరగతి విద్యార్థులకు పరీక్షకు సంబంధించిన మెటీరియల్ను అందజేశారు.

కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు పాటలు, ప్రసంగాలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి అందరినీ అలరించారు. ఈ ఫేర్వెల్ వేడుక విద్యార్థుల ఉత్సాహం, ఆనందంతో నిండిపోయి అందరికీ స్మరణీయంగా నిలిచింది.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు పి పుల్లయ్య, డి సుజాత, శ్రీదేవి, వెంకటరెడ్డి, రమేష్, సురేందర్, కిరణ్, మమత, అక్షర ఫౌండేషన్ ఉపాధ్యక్షుడు నరాల తిరుమలరెడ్డి, విద్యార్థులు పాల్గొన్నారు.

Sthanikam

గొట్టిపర్తి ప్రభుత్వ పాఠశాలలో పదవ తరగతి విద్యార్థులు ఘనంగా ఫేర్వెల్

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News