Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డివైఎఫ్ఐ రాష్ట్ర మహాసభలకు సన్నద్ధం కావాలి ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 03:59 PM

గోర్ బంజారా గ్రామ సర్పంచ్‌లు, ఉప సర్పంచ్‌లకు ఘన సన్మానం

11-01-2026 41 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ స్థానిక ప్రతినిధి కృష్ణ:నారాయణఖేడ్ నియోజకవర్గంలోని కొండాపూర్ హనుమాన్ మందిర్ ప్రాంగణంలో ఆల్ ఇండియా బంజారా ఎంప్లాయిస్ సేవా సంఘం నారాయణఖేడ్ గోర్ సిక్వాడి ఆధ్వర్యంలో గోర్ బంజారా గ్రామపంచాయతీ ఎన్నికల్లో విజయం సాధించిన సర్పంచ్‌లు, ఉప సర్పంచ్‌లకు ఘనంగా సన్మాన కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో శ్రీ సంగ్రామ్ మహారాజ్, శ్రీ రామ్ చేతన్ మహారాజ్, శ్రీ దేవీదాస్ మహారాజ్ చేతుల మీదుగా నారాయణఖేడ్ తాలూకాలో ఎన్నికైన ప్రజాప్రతినిధులను శాలువాలు, పుష్పమాలలతో సత్కరించారు.ఈ సందర్భంగా సాధు సంతులు మాట్లాడుతూ ఎన్నికలు పూర్తైన అనంతరం తాండాలలో వర్గ విభేదాలు, మనస్పర్థలు మరిచి ఐక్యతతో గ్రామాభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. తాండా అభివృద్ధి, ఆధ్యాత్మిక కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు గ్రామస్తుల సమిష్టి నిర్ణయంతో ముందుకు నడవాలని తెలిపారు.ముఖ్య అతిథులుగా పాల్గొన్న బాలా సాహెబ్, ఆర్.సి. చౌహాన్, యువ నాయకుడు సేవాలాల్ రాథోడ్ మాట్లాడుతూ సర్పంచ్‌లు తాండాలోని ప్రతి వర్గాన్ని కలుపుకొని సమన్వయంతో పాలన సాగించాలని తెలిపారు. బంజారా సమాజ ఐక్యతే అభివృద్ధికి మూలాధారమని పేర్కొన్నారు.బంజారా సమాజాన్ని సన్మార్గంలో నడిపించిన మహానీయుడు సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ జయంతిని ఇదే స్ఫూర్తితో నారాయణఖేడ్ తాలూకా స్థాయిలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు, ప్రజాప్రతినిధులు, నూతనంగా ఎన్నికైన సర్పంచ్‌లు, మాజీ నాయకులు అందరూ కలిసిమెలిసి ఘనంగా నిర్వహించాలని ఈ సందర్భంగా నిర్ణయించారు.ఈ కార్యక్రమంలో ఆల్ ఇండియా బంజారా ఎంప్లాయిస్ సేవా సంఘం బాధ్యులు వి. మెగ్య నాయక్, కె. హరిసింగ్, కె. రాజ్ కుమార్, జిల్లా, డివిజన్ ప్రధాన బాధ్యులు గుర్నాథ్, శివ నాయక్, చందర్, గణపతి శివరాం నాయక్, గోపాల్ పాల్గొన్నారు. అలాగే గోర్ సిక్వాడి, గోర్ సేన బాధ్యులు బన్సీలాల్, బి. రాజు నాయక్, పెంట్యా నాయక్, మోతిరాం తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

Sthanikam

గోర్ బంజారా గ్రామ సర్పంచ్‌లు, ఉప సర్పంచ్‌లకు ఘన సన్మానం

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News