Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 07:15 AM

గోపవరంలో రూ.47 లక్షల సీసీ రోడ్ల పనుల ప్రారంభం

23-02-2026 53 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

ముసునూరు : మంత్రి కొలుసు పార్థసారథి ఆదేశాల మేరకు ముసునూరు మండలం గోపవరం గ్రామంలో రూ.47 లక్షల వ్యయంతో నిర్మించనున్న సీసీ రోడ్ల పనులను ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ముసునూరు మండల పార్టీ అధ్యక్షులు గద్దె రఘుబాబు, గోపవరం గ్రామ పార్టీ అధ్యక్షులు ఉప్పలపాటి గణేష్‌లు కొబ్బరికాయ కొట్టి పనులకు శ్రీకారం చుట్టారు.

ఈ సందర్భంగా మాట్లాడిన గద్దె రఘుబాబు, కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత లో గ్రామాలు మంత్రి పార్థసారథి సారథ్యంలో సంక్షేమం, అభివృద్ధి రంగాల్లో వేగంగా ముందుకు దూసుకుపోతున్నాయని పేర్కొన్నారు. గోపవరం గ్రామానికి ఇప్పటివరకు సీసీ రోడ్లు, కమిటీ హాల్స్ నిర్మాణం కోసం రూ.2 కోట్ల నిధులు మంజూరు చేయించిన ఘనత మంత్రి కొలుసు పార్థసారథిదేనని తెలిపారు.

గ్రామ అభివృద్ధి కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందని, ప్రతి గ్రామంలో మౌలిక వసతుల మెరుగుదల దిశగా చర్యలు కొనసాగుతున్నాయని నాయకులు స్పష్టం చేశారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, గ్రామ పెద్దలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

Sthanikam

గోపవరంలో రూ.47 లక్షల సీసీ రోడ్ల పనుల ప్రారంభం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News