Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 05:29 AM

గొలుసుకట్టు కాలువల ద్వారా వర్టూరు చెరువును నింపి సాగునీరు అందించాలి: సిపిఐ డిమాండ్

08-04-2026 22 Views
Reporter
స్థానికం ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter

మోటకొండూరు మండల పరిధిలోని,వర్టూరు గ్రామ చెరువులను గొలుసుకట్టు కాలువల ద్వారా నింపి రైతులకు సాగునీరు అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సిపిఐ పార్టీ డిమాండ్ చేసింది.ఈరోజు వర్టూరు గ్రామంలో నిర్వహించిన ఇంటింటి ప్రచార కార్యక్రమంలో సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి బోలగాని సత్యనారాయణ పాల్గొని మాట్లాడారు.సిపిఐ పార్టీ 100 సంవత్సరాల సందర్భంగా దేశవ్యాప్తంగా ప్రజా సమస్యలపై అనేక ఉద్యమాలు,పోరాటాలు నిర్వహించిన ఘనత సిపిఐకే దక్కిందని ఆయన పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ అనుకూల విధానాలు అమలు చేస్తూ రైతులు,గ్రామీణ ప్రజల హక్కులను హరించుతోందని విమర్శించారు.కార్మిక చట్టాలలో మార్పులు చేసి,కాంట్రాక్ట్ విధానాన్ని ప్రోత్సహిస్తూ ప్రైవేటు రంగానికి మద్దతు ఇస్తోందని అన్నారు.రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని విమర్శించారు. ఆరు గ్యారంటీల పథకాన్ని అమలు చేయకపోవడం, ఇందిరమ్మ ఇళ్ల స్థలాలు,వృద్ధాప్య మరియు వితంతు పెన్షన్లు,రేషన్ కార్డులు,ఉపాధి హామీ కార్మికులకు చెల్లింపులు ఆలస్యం చేయడం వంటి అంశాలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఇంటింటి ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకురావడంతో పాటు పార్టీ నిధుల సేకరణ కూడా చేపట్టాలని నిర్ణయించామని చెప్పారు.ఆలేరు నియోజకవర్గంలో తాగు,సాగునీటి కోసం సిపిఐ అనేక పోరాటాలు నిర్వహించిందని గుర్తు చేశారు. గంధమల మరియు బస్వాపురం రిజర్వాయర్ల సాధనలో సిపిఐ పోరాటాలే కీలకమని పేర్కొన్నారు. రామాజీపేట చెరువును నింపి,నల్లబండ నుండి కాలువల ద్వారా మేడికుంటపల్లి,రాయికుంటపల్లి,వర్టూరు మీదుగా చందెపల్లి చెరువుకు నీటిని తరలిస్తే గొలుసుకట్టు వ్యవస్థ ద్వారా వేల ఎకరాల భూమి సస్యశ్యామలంగా మారుతుందని వివరించారు.గ్రామంలో పార్టీ నిధుల సేకరణ కార్యక్రమం కూడా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో సిపిఐ మండల కార్యదర్శి గాదెగాని మాణిక్యం,మండల కార్యవర్గ సభ్యులు పల్లె వెంకన్న,శాఖ కార్యదర్శి సుదగాని వెంకన్న,సహాయ కార్యదర్శి పల్లె శ్రీనివాస్,సీనియర్ నాయకులు నల్ల రాములు,కర్రె సిద్ధులు,గువ్వ సిద్ధులు,పల్లె ప్రవీణ్ కుమార్,గువ్వ వెంకన్న తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

గొలుసుకట్టు కాలువల ద్వారా వర్టూరు చెరువును నింపి సాగునీరు అందించాలి: సిపిఐ డిమాండ్

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News