Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బతుకమ్మ పండుగలో చిన్నారుల సందడి.. బహుమతులతో ప్రోత్సహించిన నేషనల్ హ్యూమన్ రైట్స్ దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 06:13 PM

గంటల వ్యవధిలోనే దంపతులు మృతి..అనారోగ్యంతో చనిపోయిన భార్య తట్టుకోలేక భర్త

16-02-2026 82 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

అనారోగ్యంతో చనిపోయిన భార్య అంత్యక్రియలు ముగించి ఇంటికి వచ్చిన కొద్దిసేపట్లోనే భర్త చనిపోయాడు. ఈ ఘటన కుమ్రంభీం ఆసిఫాబాద్‌ జిల్లా దహెగాం మండలం కమ్మర్‌పల్లిలో శుక్రవారం జరిగింది.వివరాల్లోకి వెళ్తే.. గ్రామానికి చెందిన దుర్గం వినోద్‌ (32)కు బెల్లంపల్లి మండలం గురిజాలకు చెందిన సువర్ణ (29)తో ఐదేండ్ల కింద వివాహమైంది.వీరికి పిల్లలు లేరు. వినోద్‌ కేబుల్‌ టీవీ ఆపరేటర్‌గా పనిచేస్తున్నాడు. సువర్ణ ఏడాది నుంచి అనారోగ్యంతో బాధపడుతూ ట్రీట్‌మెంట్‌ తీసుకుంటోంది.గురువారం రాత్రి 8 గంటలకు సువర్ణ తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో హాస్పిటల్‌కు తరలించారు. అక్కడ ట్రీట్‌మెంట్‌ తీసుకుంటూ చనిపోయింది. అంత్యక్రియలు పూర్తి చేసిన తర్వాత ఇంటికి వచ్చిన వినోద్‌ ఉన్నట్టుండి కిందపడిపోయాడు.గమనించిన కుటుంబ సభ్యులు, బంధువులు వెంటనే దహెగాంలోని పీహెచ్‌సీకి, అక్కడి నుంచి బెల్లంపల్లి హాస్పిటల్‌కు తరలించారు. పరీక్షించిన డాక్టర్లు వినోద్‌ అప్పటికే చనిపోయినట్లు నిర్ధారించారు. గంటల వ్యవధిలోనే దంపతులు చనిపోవడం కుటుంబసభ్యులు, గ్రామస్తులను కలచివేసింది.

Sthanikam

గంటల వ్యవధిలోనే దంపతులు మృతి..అనారోగ్యంతో చనిపోయిన భార్య తట్టుకోలేక భర్త

Article Image

అనారోగ్యంతో చనిపోయిన భార్య అంత్యక్రియలు ముగించి ఇంటికి వచ్చిన కొద్దిసేపట్లోనే భర్త చనిపోయాడు. ఈ ఘటన కుమ్రంభీం ఆసిఫాబాద్‌ జిల్లా దహెగాం మండలం కమ్మర్‌పల్లిలో శుక్రవారం జరిగింది.వివరాల్లోకి వెళ్తే.. గ్రామానికి చెందిన దుర్గం వినోద్‌ (32)కు బెల్లంపల్లి మండలం గురిజాలకు చెందిన సువర్ణ (29)తో ఐదేండ్ల కింద వివాహమైంది.వీరికి పిల్లలు లేరు. వినోద్‌ కేబుల్‌ టీవీ ఆపరేటర్‌గా పనిచేస్తున్నాడు. సువర్ణ ఏడాది నుంచి అనారోగ్యంతో బాధపడుతూ ట్రీట్‌మెంట్‌ తీసుకుంటోంది.గురువారం రాత్రి 8 గంటలకు సువర్ణ తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో హాస్పిటల్‌కు తరలించారు. అక్కడ ట్రీట్‌మెంట్‌ తీసుకుంటూ చనిపోయింది. అంత్యక్రియలు పూర్తి చేసిన తర్వాత ఇంటికి వచ్చిన వినోద్‌ ఉన్నట్టుండి కిందపడిపోయాడు.గమనించిన కుటుంబ సభ్యులు, బంధువులు వెంటనే దహెగాంలోని పీహెచ్‌సీకి, అక్కడి నుంచి బెల్లంపల్లి హాస్పిటల్‌కు తరలించారు. పరీక్షించిన డాక్టర్లు వినోద్‌ అప్పటికే చనిపోయినట్లు నిర్ధారించారు. గంటల వ్యవధిలోనే దంపతులు చనిపోవడం కుటుంబసభ్యులు, గ్రామస్తులను కలచివేసింది.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News