Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 01:13 PM

GMR Group ఉద్యోగుల మానవత్వం – మృతుని కుటుంబానికి ఆర్థిక భరోసా

23-02-2026 29 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

చిట్యాల పట్టణానికి చెందిన మునుగోటి వెంకన్న గతంలో GMR Groupలో కిందిస్థాయి సిబ్బందిగా నాలుగేళ్లు పనిచేశాడు. అనంతరం కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల అక్కడి ఉద్యోగాన్ని వీడి, మరో ప్రైవేట్ సంస్థలో పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. విధి నిర్వహణలో నిబద్ధతతో పనిచేసి ఉన్నతాధికారుల ప్రశంసలు అందుకున్న వెంకన్న ఇటీవల ప్రమాదవశాత్తు మృతి చెందాడు.

విషయం తెలిసిన వెంటనే జీఎంఆర్ కార్పొరేట్ రిలేషన్ ఇన్‌చార్జ్ శ్రీధర్ రెడ్డి, ఆయన సతీమణి సంజన రెడ్డి ఆదివారం మృతుని నివాసానికి చేరుకుని చిత్రపటానికి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి వారి ఆర్థిక పరిస్థితిని తెలుసుకున్నారు.మృతుని కుటుంబానికి తక్షణ సాయంగా రూ.25,000 నగదు అందజేసి, వెంకన్న మూడేళ్ల కుమార్తె విద్యాభ్యాసానికి అయ్యే పూర్తి ఖర్చును తమ సంస్థ భరించేలా హామీ ఇచ్చారు. ఈ చర్యకు కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు కృతజ్ఞతలు తెలుపుతూ జీఎంఆర్ ప్రతినిధుల మానవత్వాన్ని అభినందించారు.

సాధారణంగా కార్పొరేట్ సంస్థలు మాజీ ఉద్యోగుల విషయంలో పెద్దగా స్పందించని సందర్భాలు ఉన్నప్పటికీ, మాజీ సిబ్బంది కుటుంబానికి అండగా నిలిచిన జీఎంఆర్ సంస్థ చర్య పలువురి ప్రశంసలు అందుకుంటోంది.

Sthanikam

GMR Group ఉద్యోగుల మానవత్వం – మృతుని కుటుంబానికి ఆర్థిక భరోసా

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News