Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
హులిగరలో అర్హులైన కుటుంబాలకు స్మార్ట్ రేషన్ కార్డుల అందజేత అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 27, 2026 04:06 PM

ఘనంగా రథసప్తమి శోభాయాత్ర

ఘనంగా రథసప్తమి శోభాయాత్ర

ఘనంగా రథసప్తమి శోభాయాత్ర
25-01-2026 64 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

జిల్లా కేంద్రం

జిల్లా కేంద్రంలోని వేదాంత భజన మందిరం సీతారామచంద్రస్వామి దేవాలయంలో రథసప్తమి సందర్భంగా ఆదివారం వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా దేవాలయ అర్చకులు ధరూరి సింగరాచార్యులు ఆధ్వర్యంలో స్వామివారికి ప్రత్యేక ఆరాధనలు చేపట్టారు. భక్తులచే సామూహికంగా ఆదిత్య హృదయ పారాయణం, స్వామివారికి అష్టోత్తర శతనామార్చన, సూర్యనారాయణ స్వామికి మహా నివేదన నిర్వహించారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాద వితరణ చేశారు.తదుపరి సూర్యప్రభ వాహనంపై స్వామివారి శోభాయాత్ర పట్టణంలో వైభవంగా సాగింది. శోభాయాత్రలో కోలాట ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు.

ఈ కార్యక్రమంలో దేవాలయ అధ్యక్షుడు రాచూరి వెంకటేశ్వలు, కార్యదర్శి నకిరేకంటి రాజశేఖర్, కోశాధికారి సోమ అశోక్, గడ్డం వెంకన్న, గండూరి రమేష్, దంతాల సందీప్, అంతటి దినేష్, షీలా శంకర్, చిత్తలూరు శ్రీధర్, కక్కిరేణి విజయ్ కుమార్, సోమ సుమన్, వెంకన్న, ఓరుగంటి శేఖర్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

ఘనంగా రథసప్తమి శోభాయాత్ర

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News