Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 06:15 AM

ఘనంగా జీనియస్ పాఠశాల వార్షికోత్సవం

ఘనంగా జీనియస్ పాఠశాల వార్షికోత్సవం

ఘనంగా జీనియస్ పాఠశాల వార్షికోత్సవం
11-01-2026 35 Views
Reporter
స్థానికం ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter

మార్పులకు అనుగుణంగా మేధస్సు పెంపొందించుకోవాలి–జిల్లా విద్యాశాఖ అధికారి కె.సత్యనారాయణ

స్థానికం యాదాద్రి భువనగిరి జిల్లా బ్యూరో జి.శ్రీనివాస్

మారుతున్న కాలానికి అనుగుణంగా విద్యార్థులు తమ మేధస్సును పెంపొందించుకోవాలని జిల్లా విద్యాశాఖ అధికారి కె.సత్యనారాయణ సూచించారు. శనివారం స్థానిక జీనియస్ పాఠశాలలో నిర్వహించిన పాఠశాల వార్షికోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ,విద్యార్థులు విద్యార్థి దశ నుంచే క్రమశిక్షణను అలవర్చుకొని చెడు మార్గాలకు దూరంగా ఉండి, సన్మార్గాన్ని ఎంచుకోవాలని సూచించారు. తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకొచ్చేలా తమ భవిష్యత్తుకు బలమైన పునాదులు వేసుకోవాలని హితవు పలికారు.అలాగే విద్యతో పాటు సామాజిక బాధ్యతను గుర్తించి సమాజ సేవ,దేశ సేవ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనాలని విద్యార్థులను ఆయన పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమానికి ముందు జిల్లా విద్యాశాఖ అధికారి కె.సత్యనారాయణ పాఠశాల కరస్పాండెంట్ డా.బి.సూర్యనారాయణ రెడ్డి, చైర్మన్ పడాల శ్రీనివాస్,డైరెక్టర్లు తోట శ్రీధర్,కంటం నాగేందర్,ఎ.మణిపాల్ రెడ్డి, ఎస్.రాజిరెడ్డి,ఎన్.సత్యనారాయణలతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.అనంతరం ప్రార్థన గీతం ఆలపించారు.కార్యక్రమంలో విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.ముఖ్యంగా చిన్నారులు ప్రదర్శించిన నృత్యాలు ప్రేక్షకులను,తల్లిదండ్రులను ఎంతగానో అలరించాయి.ఈ సందర్భంగా పాఠశాల పూర్వ విద్యార్థులు వైద్యులు,సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు మరియు వివిధ రంగాల్లో విజయవంతంగా రాణిస్తున్న వారికి పాఠశాల యాజమాన్యం జ్ఞాపికలు అందజేసి ఘనంగా సత్కరించింది.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ బి. స్వర్ణలత,వైస్ ప్రిన్సిపల్ దిలీప్ కుమార్, ఏవోజి రవితో పాటు ఉపాధ్యాయ బృందం,విద్యార్థులు,తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Sthanikam

ఘనంగా జీనియస్ పాఠశాల వార్షికోత్సవం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News