Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 03:09 PM

ఘనంగా అన్నా మెమోరియల్ స్కూల్ 24వ వార్షికోత్సవ వేడుకలు

08-02-2026 208 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

చౌటుప్పల్ మండల కేంద్రంలోని అన్నా మెమోరియల్ స్కూల్ 24వ వార్షికోత్సవం శనివారం ఘనంగా నిర్వహించారు. చిన్నారులు, విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక, నృత్య ప్రదర్శనలు ప్రేక్షకులను అలరించాయి.వివిధ అంశాలపై రూపొందించిన నృత్యాలు, దేశభక్తి గీతాలు, జానపద నృత్యాలు కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.విద్యార్థుల ప్రతిభను తల్లిదండ్రులు, అతిథులు అభినందించారు.ఈ సందర్భంగా సంస్థ నిర్వాహకులు జి చిన్నపరెడ్డి మాట్లాడుతూ..విద్యతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి

దోహదపడతాయని తెలిపారు.ఎంఈఓ గురువారావు మాట్లాడుతూ.. విద్యార్థులు చిన్ననాటి నుంచే ప్రణాళిక బద్ధంగా చదివితే భవిష్యత్ లో ఉన్నత శిఖరాలకు చేరుకోవచ్చని పేర్కొన్నారు. చదువును కష్టంతో కాకుండా ఇష్టంతో చదవాలని విద్యార్థులకు సూచించారు.ఈ కార్యక్రమంలో పంతంగి గ్రామ మాజీ సర్పంచ్ బాతరాజు సత్యం, చిన్నపరెడ్డి సోదరుడు జి ఫాన్సీస్ రెడ్డి, వారి యొక్క అమెరికా మిత్రులు ఎలిజిబెత్, పాఠశాల ప్రిన్సిపల్స్ రాణి, సునీత, పాఠశాల అధ్యాపకులు విద్యార్థిని, విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Sthanikam

ఘనంగా అన్నా మెమోరియల్ స్కూల్ 24వ వార్షికోత్సవ వేడుకలు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News