Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 11:25 PM

ఘనంగా సావిత్రిబాయి పూలే వర్ధంతి

ఘనంగా సావిత్రిబాయి పూలే వర్ధంతి

ఘనంగా సావిత్రిబాయి పూలే వర్ధంతి
10-03-2026 27 Views
Reporter
స్థానికం ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter

వలిగొండ పట్టణ కేంద్రంలో అంబేద్కర్ చౌరస్తాలో సావిత్రిబాయి వర్ధంతి బీసీ సంఘం మండల అధ్యక్షులు సాయిని యాదగిరి ఆధ్వర్యంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సాయిని యాదగిరి మాట్లాడుతూ భారత దేశ సామాజిక సంస్కరణల చరిత్రలో గొప్ప స్థానం సంపాదించిన మహనీయురాలు సావిత్రిబాయి పూలే మహిళా విద్యకు మార్గదర్శకురాలిగా సామాజిక సమానత్వం కోసం పోరాడిన గొప్ప సంస్కర్తగా ఆమె పేరు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిందని ప్రతి సంవత్సరం మార్చి 10న ఆమె వర్ధంతిని దేశవ్యాప్తంగా ఘనంగా స్మరించుకుంటారని అన్నారు. 1831 జనవరి 3న మహారాష్ట్రలోని నయగావ్ గ్రామంలో సావిత్రిబాయి పూలే జన్మించారు. ఆ కాలంలో మహిళలకు చదువు అనేది చాలా అరుదైన విషయం. కానీ ఆమె భర్త జ్యోతిరావు పూలే ప్రోత్సాహంతో ఆమె విద్యను అభ్యసించి సమాజంలో మహిళా విద్యకు బాటలు వేసింది. 1848లో పూణేలో బాలికల కోసం భారతదేశంలోనే మొదటి పాఠశాలను ప్రారంభించడం ఆమె గొప్ప సేవగా గుర్తింపు పొందింది. సావిత్రిబాయి పూలే కేవలం ఉపాధ్యాయురాలే కాకుండా మహిళల హక్కుల కోసం, దళితుల అభివృద్ధి కోసం నిరంతరం పోరాడిన మహనీయురాలు. సమాజంలో ఉన్న అంద విశ్వాసాలు కుల వివక్ష లింగ అసమానతలను వ్యతిరేకిస్తూ ఆమె ఎన్నో ఉద్యమాలు చేసింది. బాల్య వివాహాలు ప్రతి వ్యవస్థ వంటి చెడు ఆచారాలకు వ్యతిరేకంగా ప్రజల్లో అవగాహన కల్పించిందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి నల్గొండ జిల్లా ఉద్యమకారుడు శీలం స్వామి, మాల మహానాడు జిల్లా అధ్యక్షులు పెరమండ్ల యాదగిరి,ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడు పల్లెర్ల రామచందర్, రైతు సంఘం నాయకులు యాస రంగారెడ్డి,కామ్రేడ్ కొండూరు సత్తయ్య అలియాస్ చంటి, రాపోలు పవన్ కుమార్,మస్కు నరసింహ,బీఎస్పీ జిల్లా నాయకులు పల్లెర్ల నరేష్,బీసీ నాయకులు మెరుగు వెంకటేశం, దాసరి లింగస్వామి తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

ఘనంగా సావిత్రిబాయి పూలే వర్ధంతి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News