Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఘనంగా వ్యాపారవేత్త గోదల వెంకటరెడ్డి జన్మదిన వేడుక 20 వేల పోలీస్ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేయాలి.. జేఏసీ నేతల హెచ్చరిక ధర్మవరం పట్టణంలోని వన్ టౌన్ ఎస్సైగా బాధ్యతలను స్వీకరించిన ఇషాక్ భాషా నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 03, 2026 10:30 PM

ఘనంగా హనుమజ్జయంతి వేడుకలు

ఘనంగా హనుమజ్జయంతి వేడుకలు

ఘనంగా హనుమజ్జయంతి వేడుకలు
May 12, 2026 07:13 PM 18 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

జిల్లా కేంద్రంలోని తహసిల్దార్ రోడ్డులో గల శ్రీ భక్తాంజనేయ స్వామి దేవస్థానంలో మంగళవారం హనుమజ్జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. వేద పండితులు ధరూరి రామానుజాచార్యుల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఉదయం నుంచే భక్తుల రద్దీ నెలకొంది.

ఈ సందర్భంగా భానుపురి హనుమాన్ చాలీసా భక్త బృందం, హనుమత్ దీక్ష భక్త బృందం, హనుమాన్ చాలీసా పారాయణ భక్త బృందం కలిసి 108 సార్లు హనుమాన్ చాలీసా పారాయణం నిర్వహించారు. అనంతరం వేద పండితులు స్వామివారికి నిత్య ఆరాధన, సుగంధ ద్రవ్యాలతో అభిషేకం, నాగవల్లి దళార్చన, వెండి తమలపాకులతో అర్చనలు నిర్వహించారు. స్వామివారికి ప్రత్యేక అలంకరణ చేసి నూతన పతాకావిష్కరణ కార్యక్రమం నిర్వహించారు.

కార్యక్రమంలో భాగంగా ఆరగింపు, మంగళశాసనం నిర్వహించి భక్తులకు తీర్థప్రసాదం పంపిణీ చేశారు. అలాగే అన్నప్రసాద వితరణను ఏర్పాటు చేశారు. తెల్లవారుజాము నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చి స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు.

ఈ వేడుకలకు ఏఐసీసీ నాయకులు రామ్‌రెడ్డి సర్వోత్తమ్ రెడ్డి, మున్సిపల్ చైర్‌పర్సన్ మొరిశెట్టి నివేదిత, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు పోతు భాస్కర్, సుధాకర్, పివిసి మేనేజింగ్ డైరెక్టర్ మీలా మహదేవ్ హాజరై స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు ప్రజలంతా శ్రీ ఆంజనేయ స్వామి కృపతో సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో లింగమంతుల స్వామి దేవాలయం చైర్మన్ పోలబోయిన నరసయ్య యాదవ్, రాష్ట్ర బిఆర్ఎస్ నాయకులు మోరీశెట్టి శ్రీనివాస్, కౌన్సిలర్లు ఎలిమినేటి అభినయ్, కొండపల్లి దిలీప్ రెడ్డి, గుణగంటి హేమ, నాయకులు బాలు గౌడ్, అబ్దుల్ రహీం, తంగేళ్ల కరుణాకర్ రెడ్డి, రాచకొండ శ్రీనివాస్, ప్రవీణ్ రెడ్డి, మధ్యబోయిన శ్రీనివాస్, చల్లా లక్ష్మీకాంత్, జయప్రసాద్, ఎస్‌ఎల్‌ఎస్ సాయి కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

దేవాలయ అధ్యక్షులు కొత్తా ఆంజనేయులు, కార్యనిర్వాహణాధికారి ఎం.పీ లక్ష్మణరావు ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేపట్టగా వేద పండితులు ధరూరి శ్రీధరాచార్యులు, శ్రీనాథాచార్యులు, పవన్‌కుమార్ చార్యులు, కార్తీకాచార్యులు, శ్రీనివాసాచార్యులు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News