Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండలో మెడ్‌ప్లస్ మెడికల్ షాపు ప్రారంభం. ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటు ధరల్లో అందిస్తాం: నిర్వాహకులు నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 03:50 AM

ఘనంగా ఎస్ఆర్ఎం పాఠశాల ప్రథమ వార్షికోత్సవ మహోత్సవం

ఘనంగా ఎస్ఆర్ఎం పాఠశాల ప్రథమ వార్షికోత్సవ మహోత్సవం

ఘనంగా ఎస్ఆర్ఎం పాఠశాల ప్రథమ వార్షికోత్సవ మహోత్సవం
March 11, 2026 11:29 AM 20 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada
Harish K

పేద విద్యార్థులకు తక్కువ ఫీజు తో కార్పొరేట్ విద్యను అందించాలి

పదవ తరగతి విద్యార్థులు ఒత్తిడిని తగ్గించుకునీ ప్రశాంతంగా పరీక్షలు వ్రాయాలి ఎమ్మెల్యే

ఉన్నత విద్య క్రమ శిక్షణకు మారుపేరు ఎస్ఆర్ఎం పాఠశాలని, ప్రశాంత వాతావరణంలో కార్పోరేట్ అంగులతో విద్యను అందిస్తున్న ఏకైక విద్యాసంస్థ ఎస్ఆర్ఎం పాఠశాలని కోదాడ శాసన సభ్యురాలు నలమాధ పద్మావతి రెడ్డి అన్నారు సోమవారం మున్సిపల్ పరిధిలోని స్థానిక బాలాజీ నగర్ లో నిర్మించిన ఎస్ఆర్ఎం పాఠశాల ఒక సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా వార్షికోత్సవ మహోత్సవ కార్యక్రమాన్ని పాఠశాల కరస్పాండెంట్ కేసినేని శ్రీదేవి ఆధ్వర్యంలో కనుల పండుగగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి కోదాడ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి పాల్గొని మాట్లాడుతూ కోదాడ నియోజకవర్గం ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్, పాఠశాలల అభివృద్ధికి కృషి చేస్తానని పాఠశాలల్లో విద్యను అభ్యసిస్తున్న ముఖ్యంగా 10వ తరగతి విద్యార్థులు ఒత్తిడిని తగ్గించుకొని ప్రశాంతంగా పరీక్షలు కష్టపడి చదివి ఉన్నత ఫలితాలు సాధించి పుట్టిన స్థలానికి పాఠశాలకు గురువులకు తల్లిదండ్రులకు పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలని తెలిపారు. ఎస్ఆర్ఎం పాఠశాలలో చదువుకునే పేద విద్యార్థులకు తక్కువ ఫీజుతో కార్పొరేట్ విద్యను అందించి విద్యాభివృద్ధికి బాటలు వేయాలని యాజమాన్యాన్ని కోరారు కోదాడ పట్టణంలో కార్పొరేట్ పాఠశాలలకు పోటీపడి నిర్మించి విజయం అందిస్తున్నారని తెలిపారు పాఠశాలలోఅనుభవం ఉన్న అధ్యాపకులతో విద్యను అందించి ఎన్నో విజయాలు సాధించిన పాఠశాల కరస్పాండెంట్ శ్రీదేవిని అభినందించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే విద్యార్థినిగా

విద్యను అభ్యసించినప్పుడు కష్టాలు విద్యను ఏ విధంగా అభ్యసించారొ క్రమశిక్షణతో ఉండాలోపిల్లలకు తెలియజేశారు పాఠశాల విద్యార్థులు సాధించిన విజయాలకు మెమొంటోలు ప్రశంసా పత్రాలు అందజేశారు అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు పలువురిని ఆకట్టుకున్నాయి అనంతరం పాఠశాల యాజమాన్యం ఎమ్మెల్యేను పూలమాల సాలువతో సత్కరించారు ఈ కార్యక్రమంలో కోదాడ మున్సిపల్ ఏడవ వార్డు కౌన్సిలర్ చైతన్య నాయక్ 8 వ వార్డు కౌన్సిలర్ రామ్ శెట్టి ఉదయశ్రీ శ్రీనివాస్ పాఠశాల మేనేజింగ్ డైరెక్టర్, అధ్యాపక బృందం ,విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News