Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 05:23 AM

ఘనంగా ధర్మబిక్షం 15వ వర్ధంతి కార్యక్రమం

ఘనంగా ధర్మబిక్షం 15వ వర్ధంతి కార్యక్రమం

ఘనంగా ధర్మబిక్షం 15వ వర్ధంతి కార్యక్రమం
26-03-2026 22 Views
Reporter
స్థానికం ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter

మోటకొండూరు మండల కేంద్రంలో స్వాతంత్ర్య సమరయోధుడు,తెలంగాణ సాయుధ పోరాట యోధుడు,మాజీ ఎమ్మెల్యే మరియు పార్లమెంట్ సభ్యుడు బొమ్మగాని ధర్మబిక్షం గారి 15వ వర్ధంతిని సిపిఐ మండల సమితి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా యాదాద్రి భువనగిరి జిల్లా సిపిఐ సహాయ కార్యదర్శి బొలగాని సత్యనారాయణ,సిపిఐ మండల కార్యదర్శి గాదగాని మాణిక్యం హాజరై ధర్మబిక్షం గారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ,ధర్మబిక్షం గారు స్వాతంత్ర్య సమరయోధుడిగా,తెలంగాణ సాయుధ పోరాట వీరుడిగా ప్రజల హక్కుల కోసం నిరంతరం పోరాడిన నాయకుడని కొనియాడారు.మూడు సార్లు ఎమ్మెల్యేగా,రెండు సార్లు పార్లమెంట్ సభ్యుడిగా పనిచేసి ఉమ్మడి నల్లగొండ జిల్లా ప్రజలకు విశేష సేవలు అందించారని గుర్తు చేశారు.సాయుధ పోరాట కాలంలో “తీసేవానిదే చెట్టు వానిదే భూమి” అనే నినాదంతో ప్రజల కోసం పోరాడిన ఆయన,అరాజక విధానాల రద్దు,మద్యపాన నిషేధం,చెట్టు పెంపకం కోసం భూముల కేటాయింపు వంటి అనేక సమస్యలను అసెంబ్లీ మరియు పార్లమెంటులో లేవనెత్తారని తెలిపారు.ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లడం మనందరి బాధ్యత అని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో సిపిఐ మండల కార్యవర్గ సభ్యులు బీరకాయల మల్లేష్,గ్రామ శాఖ సహాయ కార్యదర్శి జివికెలపల్లి పాండు,ఏఐవైఎఫ్ అధ్యక్షుడు బీరకాయల మధు,ఎండి గుంశీ ఎర్ర కృష్ణయ్య,బీరకాయల పోశయ్య,మొగిలిపాక యాదయ్య,తంబాల మధు,బీరకాయల రాములు,వడ్డబోయిన అచ్చయ్య,బిక్షపతి,మైసయ్య,సిద్దయ్య తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

ఘనంగా ధర్మబిక్షం 15వ వర్ధంతి కార్యక్రమం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News