Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రెండు గంటల్లోనే వాహన దొంగతనం కేసు ఛేదించిన పోలీసులు అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 29, 2026 01:26 PM

గెలిచిన అభ్యర్థులు బాధ్యతగా ఉండాలి – ప్రజల తీర్పును గౌరవించాలి

13-02-2026 75 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

విజయోత్సవ ర్యాలీలు, బాణాసంచాకు అనుమతి లేదు – జిల్లా పోలీసు అధికారి నరసింహ హెచ్చరిక

జిల్లా కేంద్రం: మున్సిపాలిటీ ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని జిల్లా పోలీసు అధికారి నరసింహ ఐపీఎస్ ప్రకటనలో తెలిపారు. ఈనెల 16వ తేదీ వరకు, మున్సిపాలిటీ చైర్మన్ ఎన్నిక పూర్తయ్యే వరకు ఎన్నికల నియమావళి అమలులో ఉంటుందని స్పష్టం చేశారు. అందువల్ల గెలుపొందిన అభ్యర్థులు విజయోత్సవ ర్యాలీలు నిర్వహించడానికి, బాణాసంచా కాల్చడానికి అనుమతి లేదని తెలిపారు.ప్రజల తీర్పును, ఎన్నికల ఫలితాలను ప్రతిఒక్కరూ గౌరవించాలని కోరారు. వార్డులు, కాలనీల్లో ఎవరూ గొడవలకు దిగకూడదని, వ్యక్తులను కించపరిచేలా మాట్లాడకూడదని సూచించారు. తప్పుడు సమాచారాన్ని సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేయవద్దని హెచ్చరించారు. యువత ఆదర్శంగా ఉండాలని, ద్విచక్ర వాహనాలపై వేగంగా తిరుగుతూ ప్రమాదాలకు గురికాకూడదని సూచించారు.

గెలిచిన వారు మరింత బాధ్యతగా ఉండాలని, ఓడిన వారు నిరుత్సాహపడకుండా ప్రజల మన్ననలు పొందుతూ మరో అవకాశానికి సిద్ధం కావాలని తెలిపారు. ప్రజలకు సేవలు అందించడంలో ముందుండాలని అన్నారు. మహాయజ్ఞంలా సాగిన మున్సిపాలిటీ ఎన్నికల నిర్వహణలో ప్రజల భద్రత, ఓటర్ల భద్రత పట్ల అప్రమత్తంగా పనిచేసిన ప్రతి పోలీసు సిబ్బందిని జిల్లా పోలీసు అధికారి అభినందించారు. ఎక్కడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కృషి చేసిన పోలీసు అధికారులు, సిబ్బంది సేవలను కొనియాడారు.ఎన్నికల నిర్వహణలో సహకరించిన వివిధ శాఖల సిబ్బందికి, ఓటర్లకు, అభ్యర్థులకు, ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. భవిష్యత్తులో కూడా మరింత పటిష్టంగా పనిచేసి ప్రజలకు పోలీసు సేవలు అందిస్తామని పేర్కొన్నారు. ఎన్నికల నియమావళి ముగిసే వరకు పోలీసు సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని, వార్డులు, కాలనీల్లో నిఘా కొనసాగించాలని సూచించారు. పోలీసు సిబ్బంది ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆదేశించారు.

Sthanikam

గెలిచిన అభ్యర్థులు బాధ్యతగా ఉండాలి – ప్రజల తీర్పును గౌరవించాలి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News