Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 02:14 PM

గీతం భూముల క్రమబద్ధీకరణపై వైఎస్ఆర్ కాంగ్రెస్ సమరశంఖం

29-01-2026 336 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ప్రభుత్వ కుట్రను అడ్డుకుంటాం – నేతల హెచ్చరిక

విశాఖపట్నం:స్థానికం ప్రధాన ప్రతినిధి

విశాఖపట్నం నగరంలో సుమారు ఐదు వేల కోట్ల రూపాయల విలువైన 54 ఎకరాలు 79 సెంట్ల ప్రభుత్వ భూమిని, విశాఖ పార్లమెంట్ సభ్యులకు చెందిన గీతం విద్యా సంస్థలకు కట్టబెట్టేందుకు ప్రభుత్వం పన్నిన కుట్రను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండించింది. ఈ నెల 30న జరగనున్న విశాఖ నగర పాలక సంస్థ కౌన్సిల్ సమావేశంలో ఈ అంశాన్ని అజెండాగా పెట్టి, తీర్మానం ద్వారా భూముల క్రమబద్ధీకరణకు యత్నిస్తున్నారని పార్టీ ఆరోపించింది.ఈ నేపథ్యంలో, వివాదాస్పద గీతం కళాశాల పరిసరాల్లోని ప్రభుత్వ భూములను వైఎస్ఆర్సీపీ అగ్రనేతలు శుక్రవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ కార్యక్రమంలో శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ, ఉత్తరాంధ్ర ప్రాంత సమన్వయకర్త కురసాల కన్నా బాబు, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్, విశాఖ జిల్లా పార్టీ అధ్యక్షులు కేకే రాజు, విజయనగరం జిల్లా జడ్పీ చైర్మన్, జిల్లా పార్టీ అధ్యక్షులు, భీమిలి నియోజకవర్గ సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) పాల్గొన్నారు.

ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ…

ప్రజలకు చెందాల్సిన వేల కోట్ల విలువైన ప్రభుత్వ ఆస్తులను ప్రైవేటు విద్యా సంస్థలకు ధారాదత్తం చేయడం ఘోర అన్యాయమన్నారు. నిబంధనలకు విరుద్ధంగా నగర పాలక సంస్థ వేదికగా ఈ భూములను క్రమబద్ధీకరించేందుకు ప్రయత్నించడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని మండిపడ్డారు.

ఈ అక్రమ తీర్మానాన్ని వెంటనే ఉపసంహరించుకునే వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజీలేని పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు. ప్రభుత్వ భూములను కాపాడటం ప్రతి పౌరుడి బాధ్యతని, ప్రజా ఆస్తుల పరిరక్షణ కోసం ప్రజలందరూ వైఎస్ఆర్సీపీకి మద్దతుగా నిలవాలని నేతలు పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర పార్టీ కమిటీ సభ్యులు, అనుబంధ విభాగాల నాయకులు, కార్పొరేటర్లు, జడ్పీటీసీలు, ఎంపీపీలు, జిల్లా, నియోజకవర్గ, మండల, వార్డు స్థాయి నాయకులు, పార్టీ ముఖ్య కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Sthanikam

గీతం భూముల క్రమబద్ధీకరణపై వైఎస్ఆర్ కాంగ్రెస్ సమరశంఖం

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News