Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మహిళా సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం : టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మల రెడ్డి కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 05:23 PM

గేదె కంటికి శస్త్ర చికిత్స

గేదె కంటికి శస్త్ర చికిత్స

గేదె కంటికి శస్త్ర చికిత్స
February 07, 2026 10:16 PM 12 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada
Harish K

శస్త్ర చికిత్సతో గేదె కంటిలో ఒకటిన్నర అంగుళం కణితి తొలగింపు

కంటి వైద్యం అంటేనే అతి సున్నితం, అందులోనూ కంటి లో ఆపరేషన్ అంటే పెద్ద రిజల్యూషన్ ( కంటి భాగాల్ని పెద్దగా సూచించే) ఉన్న పరికరాలు కావాలి, మంచి ఆపరేషన్ థియేటర్ ఉండాలి. పేషంట్ కదలకుండా ఉండాలి. ఇన్ని జాగ్రత్తల నడుమ కంటి శస్త్ర చికిత్సలు నిర్వహిస్తేనే కన్ను ఆరోగ్యం , చూపు భద్రంగా ఉంటుంది.ఇదంతా కంటి వైద్యం గురించి మనకు తెలిసిందే.

మనిషైనా జంతువైనా కన్ను నిర్మాణం , పనితీరు ఒక్కటే .ఒక గేదె కంటిలో ఒకటిన్నర అంగుళాల కణితి, కన్ను మూయడానికి మూగ జీవి నొప్పితో నరకయాతన పడుతుంది. కణితి గుడ్డు మీద నుండి లోపలి రెప్పవరకు పెరిగి లోపల ఒరుసుకుపోయి నీరు కారుతూ వైద్యం కోసం కోదాడ ప్రాంతీయ పశువైద్యశాలకి వచ్చింది. కానీ కంటిలో పెరిగిన కణితిని తొలగించడానికి శస్త్ర చికిత్స చేయాలి. దానికి కంటి పరీక్షల పరికరాలు లేవు, సూక్ష్మ బ్లేడులు, సూక్ష్మ కుట్ల దారాలు లేవు, కోదాడ పట్టణం లో కూడా దొరికే పరిస్థితి లేదు. ఆపరేషన్ థియేటర్ అంతకన్నా లేదు. సూక్ష్మ పరికరాలతో ఆపరేషన్ చేయించాలంటే హైదరాబాద్ లోని పశువైద్య యూనివర్సిటీ రెఫరల్ సూపర్ స్పెషాలిటీ పశువైద్యశాలకి వెళ్లాల్సిన పరిస్థితి . కానీ అంత వ్యయప్రయాసలకోర్చి గేదె యజమాని హైదరాబాద్ వెళ్లలేని పరిస్థితి. ఏ సదుపాయం లేకుండా ఆపరేషన్ చేస్తే ఏమాత్రం బ్లేడ్, లేదా నీడిల్ లాంటివి గుడ్డుకు తగిలినా, గేదె తల ఇసిరినా కన్ను శాశ్వతంగా కోల్పోయే ప్రమాదం ఉండడంతో మీమాంసలో అసిస్టెంట్ డైరెక్టర్ . వాహనం కిరాయికి పెట్టుకుని హైదరాబాద్ వెళ్లి అక్కడ ఉండి వైద్యం చేయించలేనని, కన్ను ఉన్నా పోయినా పరవాలేదు, గేదె మిగిలి కంటి నొప్పి తగ్గి మేతమేస్తూ గేదె బతికిపోతే చాలు ఎలాగైనా ఇక్కడే వైద్యం చెయ్యమని దీనంగా అడుగుతున్న యజమాని బాద, గేదె పరిస్థితిని గమనించిన అసిస్టెంట్ డైరెక్టర్ డా.పి.పెంటయ్య మరో ఆలోచన లేకుండా ఉన్న కొద్దిపాటి సౌకర్యాలతోనే కంటి శస్త్ర చికిత్స నిర్వహించి విజయవంతంగా గేదె కంటిలో కణితిని తొలగించారు.


వివరాల్లోకి వెళ్తే అనంతగిరి మండలం గోండ్రియాల గ్రామానికి చెందిన పాడి రైతు గంగూరి రాంబాబు పాడిగేదెకి కంటిలో గడ్డలాగా పెరిగింది. స్థానికంగా వైద్యం చేయించినా అది పెరుగుతుందే కానీ తగ్గడం లేదు, పెరిగిన గడ్డ కణితిలాగా మారి రెప్పల ఒరిపిడి తో పుండు కూడా పడి కన్ను నీరుకారుతూ కన్ను మూయడానికి గేదె నొప్పితో బాధపడుతుండంగా మెరుగైన వైద్యం కోసం కోదాడ ప్రాంతీయ పశువైద్యశాలకు తరలించారు.

ఉన్న వనరులతోనే కంటి గుడ్డుకి, చూపుకి ఎలాంటి ప్రమాదం లేకుండా మూడు గంటలపాటు శ్రమించి అతి జాగ్రత్తగా కంటిలో ని కణితిని విజయవంతంగా తొలగించారు.

అతి సున్నితమైన కంటికి ఆరుబైట ఆపరేషన్ అదీ గేదె కదలికల ఆధారంగా అప్రమత్తం అవుతూ సూదులు కత్తులు కన్నుకి కంటి లోపలి భాగాలకు,గుడ్డు కు తగలకుండగా అత్యంత జాగ్రతగా ప్రాంతీయ పశువైద్యశాలలో నిర్వహించిన శస్త్ర చికిత్సను సంబ్రమాత్స్యర్యాలతో తిలకించిన పశుపోషకులు.

శస్త్ర చికిత్సలో కాపుగల్లు పశువైద్యాధికారి డా సిరిపురపు సురేంద్ర, సిబ్బంది కర్ణ, సాగర్ పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News