Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 01:21 PM

గ్యాస్ ధరల పెంపు, కొరతపై సిపిఎం ఆగ్రహం

గ్యాస్ ధరల పెంపు, కొరతపై సిపిఎం ఆగ్రహం

గ్యాస్ ధరల పెంపు, కొరతపై సిపిఎం ఆగ్రహం
15-03-2026 67 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Penukonda
EDIGA NAVEENKUMAR

శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండలో సివిల్ సప్లై హమాలి యూనియన్ కార్యాలయంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పత్రికా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం నాయకుడు నాగరాజు మాట్లాడుతూ మహిళా దినోత్సవం రోజున మహిళలకు కానుకలు ఇవ్వకపోగా గ్యాస్ సిలిండర్ ధరలు పెంచి మహిళలపై అదనపు భారాన్ని మోపడం దుర్మార్గమని విమర్శించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గ్యాస్ కొరత లేదని చెబుతున్నప్పటికీ క్షేత్రస్థాయిలో తీవ్ర కొరత ఉందన్నారు.

సిపిఎం జిల్లా కమిటీ సభ్యుడు హరి మాట్లాడుతూ ఇరాన్‌పై ఇజ్రాయిల్, అమెరికా దాడులు, రష్యా నుంచి ఆయిల్ కొనుగోలుపై ఆంక్షలు వంటి అంతర్జాతీయ పరిస్థితులను ఎదుర్కోవడంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. ఆ వైఫల్య భారాన్ని ప్రజలపై మోపడం అన్యాయమని పేర్కొన్నారు.

సిపిఎం నాయకుడు బాబావలి మాట్లాడుతూ ప్రభుత్వాలు ధరలు పెంచడం వల్ల చిరు వ్యాపారస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. వాణిజ్య సిలిండర్లు అందుబాటులో లేకపోవడంతో ఉగాది, రంజాన్ వంటి పెద్ద పండగలు జరుపుకునే పరిస్థితి లేదన్నారు. అధికారులు వెంటనే వాణిజ్య సిలిండర్లు అందుబాటులోకి తెచ్చి చిన్న వ్యాపారస్తులకు అందేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కరించకపోతే చిరు వ్యాపారస్తులు, ప్రజలను ఐక్యం చేసి పోరాటం చేస్తామని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు వెంకట్రాముడు, ఆనందు, తిప్పన, హనుమంతు పాల్గొన్నారు

Sthanikam

గ్యాస్ ధరల పెంపు, కొరతపై సిపిఎం ఆగ్రహం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News