మట్టపల్లిలో ఏర్పాట్లు పరిశీలించిన కలెక్టర్, ఎస్పీ
సూర్యాపేట జిల్లా స్థానికం ప్రతినిధి బిక్షం
తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ శుక్రవారం సూర్యాపేట జిల్లా మట్టపల్లి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానాన్ని దర్శించనున్న నేపథ్యంలో ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్, జిల్లా ఎస్పీ నరసింహతో కలిసి గురువారం పరిశీలించారు.ఈ సందర్భంగా డయాస్ ఏర్పాటు, ప్రముఖులు ఇతరులకు కేటాయించిన సీటింగ్, పబ్లిక్ అడ్రస్ వ్యవస్థ, ఎల్ఈడీ ఏర్పాట్లు, డయాస్ సమీపంలో అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపనకు సంబంధించిన శిలాఫలకాల అమరికలను పరిశీలించారు. గవర్నర్‌కు ఇచ్చే పోలీసు గౌరవ వందనం, వివిధ శాఖలు ఏర్పాటు చేస్తున్న స్టాళ్లు, దేవాలయ అలంకరణ తదితర అంశాలను కలెక్టర్, ఎస్పీ సమగ్రంగా తనిఖీ చేసి అధికారులకు సూచనలు జారీ చేశారు.గవర్నర్ రాక సందర్భంగా ఎలాంటి లోటుపాట్లు లేకుండా, ఆయన మట్టపల్లికి వచ్చినప్పటి నుంచి తిరిగి వెళ్లే వరకు అన్ని కార్యక్రమాలు సవ్యంగా సాగేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.గవర్నర్ మట్టపల్లి సందర్శన సందర్భంగా హుజూర్నగర్ సమీపంలోని ముగ్దుమ్ నగర్ వద్ద వంద ఇరవై ఆరు కోట్ల రూపాయల వ్యయంతో ఏర్పాటు చేయనున్న వ్యవసాయ విశ్వవిద్యాలయానికి, కోదాడలో యాభై కోట్ల రూపాయలతో నిర్మించనున్న జవహర్ నవోదయ విద్యాలయ భవనానికి, మట్టపల్లి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ ప్రాంగణంలో ఒక కోట్ల రూపాయలతో నిర్మించనున్న వసతి గృహం, వంటశాల, తాగునీటి ట్యాంకుకు, అలాగే మరో ఒక కోట్ల రూపాయలతో నిర్మించనున్న యాత్రికుల సదన్, పిపిజిఐ షెడ్, సీసీ రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయనున్నారు.అలాగే దేవాలయ ఆవరణలో వ్యవసాయ, పౌర సరఫరాలు, ఉద్యాన, గ్రామీణాభివృద్ధి, విద్య, నీటిపారుదల, గృహ నిర్మాణ శాఖల ద్వారా ఏర్పాటు చేస్తున్న స్టాళ్లను గవర్నర్ సందర్శించనున్నారు.ఈ పరిశీలనలో కలెక్టర్ వెంట ఆర్డీవోలు, పోలీసు అధికారులు, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి