Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చిన్న కోతలతోనే ఛాతీ శస్త్రచికిత్సలు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 11:35 AM

గురుజువాడ నూతన సర్పంచ్‌గా మ్యతరీ ప్రియాంక రాజేందర్

23-12-2025 69 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్, ఉపసర్పంచ్, వార్డు సభ్యుల ప్రమాణ స్వీకారం

సంగారెడ్డి జిల్లా, స్థానికం ప్రతినిధి

జహీరాబాద్ నియోజకవర్గం కోహీర్ మండల పరిధిలోని గురుజువాడ గ్రామ పంచాయతీ కార్యాలయంలో సోమవారం నూతన పాలకవర్గం ఘనంగా ప్రమాణ స్వీకారం చేసింది. ఇటీవల నిర్వహించిన పంచాయతీ ఎన్నికల్లో గెలుపొందిన మ్యతరీ ప్రియాంక రాజేందర్ సర్పంచ్‌గా, సాయి కుమార్ ఉపసర్పంచ్‌గా, పది మంది వార్డు సభ్యులు బాధ్యతలు స్వీకరించారు.

పంచాయతీ కార్యదర్శి బి. గీత ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో నూతన పాలకవర్గంతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ గ్రామ ప్రజల సహకారంతో అన్ని రంగాల్లో గ్రామ అభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు. మౌలిక వసతుల అభివృద్ధి, పారిశుధ్యం, తాగునీరు, రహదారులు, సంక్షేమ పథకాల అమలుకు ప్రాధాన్యం ఇస్తామని పేర్కొన్నారు. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ సేవలందిస్తామని స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్‌లు, మాజీ ఎంపీటీసీలు, ప్రభుత్వ అధికారులు, గ్రామ పెద్దలు, ప్రజాప్రతినిధులు, యువత, గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని నూతన పాలకవర్గానికి శుభాకాంక్షలు తెలిపారు.

Sthanikam

గురుజువాడ నూతన సర్పంచ్‌గా మ్యతరీ ప్రియాంక రాజేందర్

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News